AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తగా చేరిన వారికి టికెట్ కేటాయిస్తారా.. అంటూ ఫర్నీచర్ ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు

పశ్చిమబెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గురువారం రోజున కేంద్రమంత్రి జేపీ నడ్డా బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన లోక్ సభ అభ్యర్ధులపై పార్టీ శ్రేణులనుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో.. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇటీవలే బీజేపీలో చేరిన నిశిత్ ప్రమాణిక్ కు […]

కొత్తగా చేరిన వారికి టికెట్ కేటాయిస్తారా.. అంటూ ఫర్నీచర్ ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 4:01 PM

Share

పశ్చిమబెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గురువారం రోజున కేంద్రమంత్రి జేపీ నడ్డా బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన లోక్ సభ అభ్యర్ధులపై పార్టీ శ్రేణులనుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో.. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇటీవలే బీజేపీలో చేరిన నిశిత్ ప్రమాణిక్ కు కూచ్ బెహర్ లోక్ సభ స్థానం నుంచి పార్టీ టికెట్ ఇచ్చింది. నిశిత్ ప్రమాణిక్‌కు టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ..ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

Follow Us