నేత‌ల్లో గుబులు పుట్టిస్తోన్న బండి పాద‌యాత్ర.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడ్ చేయాలా? వ‌ద్దా? అనే మథనం

తెలంగాణ కాషాయ సార‌థి బండి సంజ‌య్ పాద‌యాత్ర నేత‌ల్లో గుబులు రేపుతోంది. పాద‌యాత్రను త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో

నేత‌ల్లో గుబులు పుట్టిస్తోన్న బండి పాద‌యాత్ర.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడ్ చేయాలా? వ‌ద్దా? అనే మథనం
Bandi Sanjay
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 14, 2021 | 7:56 PM

Bandi Sanjay Paja Sangrama Yatra: తెలంగాణ కాషాయ సార‌థి బండి సంజ‌య్ పాద‌యాత్ర నేత‌ల్లో గుబులు రేపుతోంది. పాద‌యాత్రను త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడ్ చేయాలా ? వ‌ద్దా? అనే అనుమానాల‌తో నేత‌లు త‌ర్జన‌ భ‌ర్జన‌లు ప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లు పూర్తిస్థాయిలో అప్పగించ‌కుండా.. ఎలా ముందుకు వెళ్లాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు. పాద‌యాత్రపై క్షేత్రస్థాయిలో నేత‌లు ఏమ‌నుకుంటున్నారు?

బండి సంజ‌య్‌.. తెలంగాణ కాషాయ ద‌ళ‌ప‌తి. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో జ‌నాల్లో వెళ్లడానికి పూర్తి స్థాయిలో స‌న్నాహాలు చేసుకుంటున్నారు. మూడు లేదా నాలుగు విడ‌త‌ల్లో రాష్ట్రాన్ని చుట్టేయాల‌ని భావిస్తున్నారు. ఈ మేర‌కు మొద‌టి విడ‌త పాద‌యాత్రను హైద‌రాబాద్ భాగ్యల‌క్ష్మీ టెంపుల్ నుంచి హుజూరాబాద్ వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. ఈ నెల 24న ప్రారంభంకానున్న పాద‌యాత్రకు గ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. బండి సంజయ్ పాద‌యాత్ర త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే లీడ్ చేయాలా? వ‌ద్దా? అనే అనుమానాల‌తో మథన ప‌డుతున్నారు ఎమ్మెల్యే స్థాయి నేత‌లు.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టిక్కెట్ క‌న్ఫర్మ్ చేస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాద‌యాత్రని పూర్తిస్థాయిలో విజ‌య‌వంతం చేయ‌డానికి సిద్దంగా ఉన్నట్లు ప‌లువురు నేత‌లు స్పష్టం చేస్తున్నారు. నేత‌లకు పార్టీ నుంచి ఎలాంటి భ‌రోసా రాక‌పోవ‌డంతో ఎలా ముందుకు వెళ్లాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు. భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి.. బ‌హిరంగ స‌భ‌లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయ‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని ప‌లువురు నేత‌లు చెబుతున్నారు. ఆ స‌భ‌ల్లో త‌మ పేరును అభ్యర్థిగా ప్రక‌టించాల‌ని బండి సంజ‌య్‌పై ఇప్పటి నుంచి ఒత్తిళ్లు మొద‌ల‌య్యాయి. పార్టీ సంస్థాగ‌త జాతీయ‌ ప్రధాన‌ కార్యద‌ర్శి సంతోష్ జీ నిర్వహించిన స‌మావేశంలో ఇదే అభిప్రాయాన్ని నేత‌లు వ్యక్తం చేశారు.

ఇక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారికి మ‌రో స‌మ‌స్య కూడా ఇబ్బందిక‌రంగా మారింది. ఒక‌వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాద‌యాత్రకు హంగామా చేస్తే.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఏమ‌నుకుంటారోన‌నే భ‌యంతో కొంద‌రు నేత‌లు ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నవాళ్లు ఎలా ముందుకు వెళ్లాలో తెలియ‌క కిందా మీదా ప‌డుతున్నారు. క‌టౌట్లు, ఫ్లెక్సీల్లో బండి సంజ‌య్‌కి ప్రాధాన్యత ఇస్తే.. కిష‌న్ రెడ్డి ఎక్కడ చిన్నచూపు చూస్తార‌నే భ‌యం నేత‌ల‌ను వెంటాడుతోంది. పార్టీ రాష్ట్ర క‌మిటీల్లో క‌నీసం చోటు ఇవ్వకుండా.. పాద‌యాత్ర క‌మిటీల్లో ప‌నిచేయాల‌ని చెప్పడంపై ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌లు అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.

Read also: తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.. లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు