తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమ, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ వేళ తమిళభాషపై టన్నుల కొద్దీ ప్రేమను కురిపిస్తున్నారు ప్రధాని మోదీ, అమిత్ షా. తమిళం అందమైన భాషని మోదీ మన్‌కీబాత్‌ లో పదేపదే చెబితే,..

  • Venkata Narayana
  • Publish Date - 10:06 pm, Sun, 28 February 21
తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమ, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ వేళ తమిళభాషపై టన్నుల కొద్దీ ప్రేమను కురిపిస్తున్నారు ప్రధాని మోదీ, అమిత్ షా. తమిళం అందమైన భాషని మోదీ మన్‌కీబాత్‌ లో పదేపదే చెబితే, తమిళం నేర్చుకోలేనందుకు చింతిస్తున్నానంటూ అమిత్ షా తమిళతంబీలకు క్షమాపణలు చెప్పేస్తున్నారు. కట్ చేస్తే, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. అందుకోసమే బీజేపీ అగ్రనేతలందరి నోటా ఇప్పుడు తమిళనాడు మంత్రమే. తాజాగా మన్‌కీబాత్‌లో తమిళనాడుపై ఫోకస్‌ పెట్టారు ప్రధాని మోదీ. తమిళం ఎంతో అందమైన భాషని….అత్యంత ప్రాచీనమైన భాషల్లో ఒకటైన తమిళ్‌ని నేర్చుకోలేకపోవడం బాధగా ఉందని పశ్చాత్తాపం వ్యక్తంచేశారు.

తమిళ భాషని, సాహిత్యాన్ని మోదీ తెగపొగిడేశారు. గతంలోనూ ప్రధాని తమిళ భాష గురించి ప్రస్తావించిన సంగతి తెలసిందే. పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలోనూ పలుమార్లు తమిళ సూక్తులను ఉపయోగించారు. 2019లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా తమిళ సాహితీవేత్త కనియన్ పుంగుండ్రనార్ గురించి ప్రస్తావించారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వేళ.. తమిళ భాషను ప్రశంసించడం ఆసక్తిగా మారింది. మరోవైపు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా…తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు.

Read also : Prabhas’s Salaar: 14 ఏప్రిల్ 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం, ‘సలార్’ సినిమాపై సన్సేషనల్ వార్త రివీల్