AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌..

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

BJP: ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌..
Bjp National Executive Meet
Sanjay Kasula
|

Updated on: Nov 07, 2021 | 11:47 AM

Share

BJP National Executive meeting: ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో యూపీ స‌హా ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెట్టనున్నారు. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిచనున్నారు. అలాగే ఇటీవల జరిగిన బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో ఓటమి కారణాలపైనా విశ్లేషించనున్నారు. అలాగే కొవిడ్‌ కట్టడిలో కేంద్రం పనితీరు, టీకా పంపిణీ ప్రక్రియ, ప్రధాని ఇటలీ, బ్రిటన్‌ టూర్‌, జీఎస్టీ వసూళ్ల రికార్డ్‌పైనా చర్చించనున్నారు. గతేడాది కరోనా వ్యాప్తి తర్వాత బీజేపీ కార్యవర్గ భేటీ జరగడం ఇదే తొలిసారి.

న్యూఢిల్లీలోని ఎన్‌డిఎంసి కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కీలక సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా బీజేపీ  అగ్రనేతలు హాజరవుతున్నారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో నెక్స్ట్‌ ఇయర్‌ లాస్ట్‌లో ఎలక్షన్స్‌ నిర్వహిస్తారు. ఐతే పంజాబ్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

ఇక కరోనా నేపథ్యంలో ఈ సమావేశానికి కొద్దిమందే హాజరవగా..ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలంతా వర్చువల్‌ విధానంలో పాల్గొంటున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగంతో ఈ భేటీ ముగియనుంది.

జాతీయ కార్యవర్గ సమావేశం కోసం ప్రధానమంత్రి అంతకుముందు NDMC సెంటర్‌కు వచ్చారు. ఆయన వెంట వెంటనే కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ఉన్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, హర్దీప్ పూరి, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ కూడా వేదిక వద్దకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సభా వేదిక వద్ద కనిపించారు.

ఇవి కూడా చదవండి: Drone Attack: బాగ్దాద్‌లో భారీ పేలుడు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడి..

Income Tax: ఇళ్లు, భూమి కోనుగోలు చేస్తున్నారా.. ఈ విషయంను తప్పకా గుర్తుంచుకోండి..