Free Ration: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. మరో ఆరు నెలలపాటు ఉచిత రేషన్.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఈ నెలతో ముగియనుంది.

Free Ration: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..  మరో ఆరు నెలలపాటు ఉచిత రేషన్.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
Aravind Kejriwal
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 07, 2021 | 9:58 AM

Free Ration in Delhi: కరోనా సృష్టించి కల్లోలానికి ప్రపంచ ఆర్థక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పేద, బడుగు వర్గాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ పంపిణీ చేశాయి. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ లో కూడా దీనిని కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, కరోనా తగ్గుముఖం పట్టడం.. వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆ ఉచిత రేషన్ పథకాన్ని ఈ నెలాఖరు తర్వాత నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఈ నెలతో ముగియనుంది. అయితే, దీనిని పొడిగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేయడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. దీనికి సంబంధించి సీఎం ట్వీట్ చేశారు. మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్ పథకాన్ని ఢిల్లీలో పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా ఎన్నో రంగాలు అభివృద్ధికి దూరం అయ్యాయని.. ద్రవ్యోల్బణం కూడా పెరిగిందని సీఎం ప్రస్తావించారు.

కరోనా అనంతరం కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడక, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధాని మోడీని ఆయన కోరినట్లు తెలిపారు. పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పొడిగించండి అంటూ ట్విట్టర్ ద్వారా వేడుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. పీఎం ప్రధాని మోదీకి ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

Read Also…. PPF: మీ పిల్లల భవిష్యత్ కోసం కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టండి.. లక్షల్లో రాబడి పొందండి.. దీనిపై టాక్స్ కూడా ఉండదు!