India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన

India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2021 | 9:39 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు దేశవాసులను ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం కలిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,853 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 526 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,44,845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 260 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98.24 శాతానికి పైగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది

తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,55,536 కి చేరగా.. మరణాల సంఖ్య 4,60,791 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న కరోనా నుంచి 12,432 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,49,900 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,08,21,66,365 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 9,19,996 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 61,48,85,747 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Railway Crossing: దూసుకొచ్చిన మృత్యువు.. బైక్‌ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు పిల్లలు సహా దంపతుల దుర్మరణం..

Army Man Dies: ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలు.. ఎముకలు కొరికే చలి.. దేశ సరిహద్దులో అమరుడైన వీర జవాన్