పత్తాలేని ప్రజాయుద్దనౌక..ఇంతకీ ఆయనెక్కడ?

ఆయన పాట ఎన్నో ఉద్యమాలకు బాట చూపింది. మరెన్నో పోరాటాలకు ఊపిరిపోసింది. ఏ ఉద్యమం జరిగినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. ఆయన గళమెత్తితే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 40 రోజులు దాటింది. ఆయన పాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఆర్టీసీ సమ్మెకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్న అందరిని వెంటాడుతోంది. ప్రజా గాయకుడు గద్దర్ ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రశ్న పొలిటికల్‌ సర్కిల్స్‌‌లో చక్కర్లు కొడుతోంది. ఆరు […]

పత్తాలేని ప్రజాయుద్దనౌక..ఇంతకీ ఆయనెక్కడ?
Rajesh Sharma

| Edited By: Srinu Perla

Nov 22, 2019 | 8:40 PM

ఆయన పాట ఎన్నో ఉద్యమాలకు బాట చూపింది. మరెన్నో పోరాటాలకు ఊపిరిపోసింది. ఏ ఉద్యమం జరిగినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. ఆయన గళమెత్తితే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 40 రోజులు దాటింది. ఆయన పాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఆర్టీసీ సమ్మెకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్న అందరిని వెంటాడుతోంది.

ప్రజా గాయకుడు గద్దర్ ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రశ్న పొలిటికల్‌ సర్కిల్స్‌‌లో చక్కర్లు కొడుతోంది. ఆరు నెలలైంది. గద్దర్‌ కనిపించడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని పలువురు నేతలు ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుండి 2018 మహా కూటమి వరకు చాలా చురుగ్గా ఉన్న ప్రజా యుద్దనౌక ఇప్పుడు ఎందుకు మూగబోయింది.

49 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే గద్దర్ ఎందుకు స్పందించడం లేదు? ఎక్కడ ఏ ప్రజాఉద్యమం జరిగినా గద్దర్‌ ముందుంటారు. తనదైన శైలిలో పాటలతో ఉత్తేజపరుస్తారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన సంఘీభావం కూడా ప్రకటించలేదు. ఆర్టీసీ సమ్మెకు గద్దర్‌ ఎందుకు దూరంగా వున్నారో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. గద్దర్‌ మౌనానికి కారణం ఏమిటీ..? ఈమద్య గద్దర్‌ ఎందుకు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు…అనేది హాట్ టాపిక్ గా మారింది.

గద్దర్ రాజకీయాలకు..ప్రజా సమస్యల కు దూరంగా ఉన్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురువుతున్నాయి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో సోనియాగాంధీ మొదలు చంద్రబాబు వరకు హేమాహేమీలతో బిజీబిజీగా గడిపిన గద్దర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజాకూటమి తరఫున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ప్రజాకూటమి పరాజయం తర్వాత గద్దర్‌ సైలెంట్‌ అయ్యారు. ప్రస్తుతం గద్దర్‌ సొంతపనుల్లో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఆయన లోకల్‌‌గా ఎక్కువగా ఉండడం లేదని అంటున్నారు. కానీ ఆయన లేని లోటు మాత్రం సమ్మెలో స్పష్టంగా కనిపించింది అని ఆయన అభిమానుల వెర్షన్‌.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu