అఖిలప్రియపై తమ్ముని కేసు..అసలు కథే వేరే వుందిలే!
భూమా ఫ్యామిలీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి అక్క, తమ్ముడు మధ్య గొడవ వైరల్ అయింది. తనకు తెలియకుండా భూమిని అమ్మారని బ్రదర్ కోర్టుకు ఎక్కారు. అయితే కుటుంబ కహానీలో ట్విస్ట్ ఉందనేది ఆళ్లగడ్డ వాసుల అనుమానం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? రీడ్ దిస్ స్టోరీ.. భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అక్కపై తమ్ముడు ఎందుకు కేసు పెట్టారు? భూ వివాదమా? లేక ఫ్యామిలీ డ్రామానా? ఇవిప్పుడు రాయలసీమ వాసులను మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా […]
భూమా ఫ్యామిలీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి అక్క, తమ్ముడు మధ్య గొడవ వైరల్ అయింది. తనకు తెలియకుండా భూమిని అమ్మారని బ్రదర్ కోర్టుకు ఎక్కారు. అయితే కుటుంబ కహానీలో ట్విస్ట్ ఉందనేది ఆళ్లగడ్డ వాసుల అనుమానం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? రీడ్ దిస్ స్టోరీ..
భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అక్కపై తమ్ముడు ఎందుకు కేసు పెట్టారు? భూ వివాదమా? లేక ఫ్యామిలీ డ్రామానా? ఇవిప్పుడు రాయలసీమ వాసులను మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులను తొలుస్తున్న ప్రశ్నలు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత తమ్ముడు షాకిచ్చారు. ఓ భూవివాదంలో తన ఇద్దరు అక్కలపై భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టుకు ఎక్కారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎకరాల భూమిని భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడే రెండు కోట్ల రూపాయలకు అమ్మారు. అప్పుడు మైనర్‌గా ఉన్న విఖ్యాత్‌రెడ్డి రిజిస్ట్రేషన్ టైమ్‌లో వేలి ముద్ర మాత్రమే వేశారు. అయితే తనకు తెలియకుండా భూ అమ్మకం జరిగిందని విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు కోర్టులో కేసు వేశారు.
అయితే విఖ్యాత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు కోర్టును ఆశ్రయించారు? ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది ఇప్పడు హాట్ టాపిక్ అయింది. ఆళ్లగడ్డ ఎన్నికల టైమ్‌లో కూడా విఖ్యాత్‌రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. అక్క అఖిలప్రియతో కలిసి ప్రచారం చేశారు. ఆతర్వాత జరిగిన పరిణామాల్లో కూడా అక్క వెంటే నడిచారు. ఆళ్లగడ్డలో తమ వర్గానికి అక్క తర్వాత తానే అండగా ఉంటానని ప్రకటనలు చేశారు. అయితే అఖిలప్రియ ప్లేస్‌లో ఆళ్లగడ్డలో జగత్ రావాలని కొందరు కార్యకర్తలు కోరుకున్నారు. ఈ విషయంలో ఏమైనా కుటుంబంలో విభేదాలు వచ్చి ఆస్తులు గొడవ జరుగుతుందా? అని కొందరు ఆరా తీశారు. అయితే అసలు విషయం వేరే ఉందని తెలిసింది.
అయితే భూమా ఉన్నప్పుడే తమ బంధువులకు హైదరాబాద్ శివారులోని భూమిని అమ్మారు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాలతో భూమి కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టేందుకే విఖ్యాత్‌రెడ్డి సొంత అక్కలపై కేసు వేశారని ఓ ప్రచారం నడుస్తోంది. న్యాయవాదుల సలహా మేరకే విఖ్యాత్ కోర్టును ఆశ్రయించారని…కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది. ఈ కేసును వాదిస్తున్న లాయర్ కూడా భూమా అఖిలప్రియ బంధువే అని సమాచారం. ఇటు ప్రస్తుతం అఖిలప్రియ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ టూర్‌లో ఉన్నారు. తన తమ్ముడు తనతో పాటే ఉన్నారని… తమ మధ్య భూ వివాదాలు లేవని దుబాయ్ నుంచి ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి భూమా ఫ్యామిలీలో మెలో డ్రామా కాదు. ఓన్లీ లీగల్ ఫైట్ పేరిట ఓ యాక్షన్ ప్లాన్ అని మాత్రం క్లారిటీ వస్తోంది.