2024 తర్వాత హైదరాబాద్‌లో ఆస్తులన్నీ తెలంగాణకే: మంత్రి బుగ్గన
హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులన్నీ చట్టప్రకారం 2024 తర్వాత తెలంగాణకే చెందుతాయని.. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ఎలా ఇస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఏడాదిలోనే అన్ని ఆస్తుల్ని వదిలేసి చంద్రబాబు.. విజయవాడకు వచ్చేశారని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న భవనాలకు అనవసరంగా నిర్వహణ ఖర్చులు, పన్నులు చెల్లించడం ఎందుకని అప్పగించేసినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.