AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్.. సడన్‌గా టీడీపీలో చేరిన జీవీ రెడ్డి..

ఏపీ కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. బాబు ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

TDP: ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్.. సడన్‌గా టీడీపీలో చేరిన జీవీ రెడ్డి..
Gv Reddy Joins Tdp
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2021 | 8:40 AM

Share

ఏపీ కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. క్రీయాశీలక పార్టీలో చేరాలనే నిర్ణయంతో టీడీపీలో చేరినట్లు జీవిరెడ్డి తెలిపారు. తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు పసుపు కండువా కప్పి చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తనను చేర్చుకున్నందుకు చంద్రబాబుకు జీవీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి మరింత నష్టం చేకూరవద్దంటే చంద్రబాబును బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు జీవీ రెడ్డి.  విజన్ లేకుండా నిధులు పప్పు బెల్లాలు పంచినట్టు పంచితే భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే.. జగన్ వినాశనం కోరుకునే వ్యక్తి అని విమర్శించారు.  కొన్ని వర్గాలు చంద్రబాబుపై అకారణంగా ద్వేషం పెంచుకోవడం వల్ల రాష్ట్రం నాశనమైందని అభిప్రాయపడ్డారు.

ప్రారంభమైన బాబు దీక్ష

చంద్రబాబు 36 గంటల దీక్ష ప్రారంభం అయ్యింది. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ..చంద్రబాబు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేపట్టారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో ఆయన దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అనుమతి లేఖను టీడీపీ ఆఫీసుకు పంపించారు పోలీసులు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

Also Read:  ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్… ఉత్తర్వులు జారీ

ఓరి గడుగ్గాయ్.. బైక్‌లో ఇన్ని లిక్కర్ బాటిల్సా.. కౌంట్ చేసి కంగుతిన్న పోలీసులు