AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ భద్రతపై అనుమానాలు..! అసలేం జరిగింది..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో వివాదం చెలరేగుతోంది. ఈ రోజు ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరేందుకు రెడీ అయ్యారు. అయితే.. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ప్రయాణిస్తున్నహెలీకాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయంటూ.. అధికారులు సమాచారమిచ్చారు. రెండు రోజులుగా సీఎం జగన్ హెలీకాఫ్టర్ ల్యాండింగ్‌కు సంబంధించి.. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ.. సీఎంవో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో అధికారులు […]

జగన్ భద్రతపై అనుమానాలు..! అసలేం జరిగింది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 23, 2019 | 4:11 PM

Share

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో వివాదం చెలరేగుతోంది. ఈ రోజు ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరేందుకు రెడీ అయ్యారు. అయితే.. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ప్రయాణిస్తున్నహెలీకాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయంటూ.. అధికారులు సమాచారమిచ్చారు.

రెండు రోజులుగా సీఎం జగన్ హెలీకాఫ్టర్ ల్యాండింగ్‌కు సంబంధించి.. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ.. సీఎంవో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో అధికారులు అలసత్వంగా వ్యవహరించారంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం బయలు దేరారు. అయితే.. గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సంబంధించి.. టెక్నికల్‌గా సమస్యలు ఉన్నాయంటూ.. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చారు.. హెలీకాఫ్టర్ సిబ్బంది. దీంతో.. సీఎంవో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి ఉంటే.. ముందే చూసుకోవాలన్నారు. హెలీకాఫ్టర్ ల్యాండింగ్ సమస్య వల్ల.. సీఎం ఈ రోజు హైదరాబాద్‌కు ఆలస్యంగా వెళ్లారు.

మరోవైపు 21వ తేదీ శనివారం నాడు కర్నూలు జిల్లా నంద్యాలలో.. జగన్ ప్రయాణించిన హెలీకాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో.. కూడా తప్పుడు సమాచారమే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హెలీకాఫ్టర్ ల్యాండింగ్ వివరాలను ప్రొఫార్మా ప్రకారం డిగ్రీలు, మినిట్స్, సెకన్స్‌లో ఇవ్వాల్సి ఉండగా.. కేవలం డిగ్రీల్లో మాత్రమే ఇచ్చారన్న ఆరోపణలు ఎదురవుతోన్నాయి. ఇది చాలా నిర్లక్ష్యమంటూ సీఎంవో అధికారులు గుర్తించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈ విషయాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. విచారణ జరపాలంటూ.. కర్నూలు కలెక్టర్‌కు సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. కర్నూలు డీఆర్‌ఎం వెంకటేశ్వరన్‌ని విచారణ అధికారిగా నియమించారు. అలాగే.. కర్నూలు సర్వేశాఖ డీఈ వేణుకు కలెక్టర్ వీరపాండ్యన్ నోటీసులు అందజేశారు. సీఎం జగన్.. పర్యటనకు సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడంపై వేణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. డీఈ వేణుపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

అయితే.. వాతావరణంలో వచ్చే మార్పులు కూడా.. హెలీకాఫ్టర్ ల్యాండింగ్‌కు జాప్యం కారణం కావచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. విజయవాడలో వాతావరణం తెరపిగా ఉన్నప్పుడు.. హైదరాబాద్‌లో ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అలాగే.. రెండు మూడు రోజులుగా వర్షాలు కూడా పడుతోన్నాయి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా.. ఇలాంటి పొరబాట్లు జరగడం సహజమేనని కూడా అంటున్నారు.