Amaravathi Lands: తగ్గేదే లేదు.. అమరావతి అసైన్డు భూముల కుంభకోణంపై సుప్రీం కోర్టుకు ఏపీ సీఐడీ

అమరావతి అసైన్డు భూముల కుంభకోణం కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై...

Amaravathi Lands: తగ్గేదే లేదు.. అమరావతి అసైన్డు భూముల కుంభకోణంపై సుప్రీం కోర్టుకు ఏపీ సీఐడీ
Cid Probe On Babu
Ram Naramaneni

|

Mar 20, 2021 | 1:18 PM

అమరావతి అసైన్డు భూముల కుంభకోణం కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నాలుగు వారాలపాటు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్ట్‌ స్టే పై సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. హైకోర్ట్ స్టే వెకెట్ పై పిటీషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది.

మరోవైపు, అమరావతి అసైన్డ్‌ భూకుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ చేసింది సీఐడీ. ప్రధానంగా సాక్ష్యాధారాలపైనే ఫోకస్ చేసింది. ఈ కేసులో బాధితులు, బాధ్యుల నుంచి సమగ్ర వివరాలు సేకరించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఇవాళ మరికొందర్ని విచారించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాజధాని పరిసరాల్లో భూములు కొన్న వారిపైనే దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ, ఈడీ అధికారులకు సీఐడీ లేఖలు రాసింది. రెండు లక్షల నగదు బదిలీలపై విచారణ జరపాలని కోరింది.

ఏపీ రాజధాని నగర నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం, అథార్టీ చేపట్టిన చర్యలపై దావా వేయడం, ప్రాసిక్యూట్‌ చేయడంపై సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం నిషేధం ఉందని గుర్తుచేసింది. అలాగే సీఐడీ విచారణ అర్హతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేశాక, ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాకుండా పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో సైతం గుర్తించినట్లు సమాచారం.

విచారణపై స్టే కేవలం చంద్రబాబు, నారాయణలకే వర్తిస్తుందని కోర్టు క్లారిటీ ఇచ్చింది. వాళ్లు మాత్రమే కోర్టును ఆశ్రయించడంతో మినహాయింపు ఇచ్చింది. దీంతో కేసులతో సంబంధం ఉన్న మిగతా వాళ్లని విచారించాలని సీఐడీ డిసైడ్‌ అయింది. అధికారులు, రైతుల నుంచి కీలక విషయాలు రాబట్టాలని చూస్తోంది.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే సీఐడీ ఎదుట హాజరై పలు ఆధారాలు సమర్పించాడు. వాటి ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది రైతుల్ని పిలిపించి విచారించారు. భూములు అమ్మాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా.. అంగీకారంతోనే ఇచ్చేశారా.. బలవంతపు సేకరణ జరిగిందా.. ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలను అమ్ముకున్నారనే విషయాలపై ఆరాతీశారు. ఇవాళ్టి నుంచి ఏ రకంగా దర్యాప్తు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: ‘ఆ అమ్మాయి నాది’ అని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు.. ఆగిపోయిన పెళ్లి.. కట్ చేస్తే.. వన్‌ సైడ్‌ లవ్‌ అట

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. భలే ప్లాన్ చేశారుగా..!

 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్:

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu