AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. భలే ప్లాన్ చేశారుగా..!

ఇన్నాళ్లూ చోరీ చేసిన సొత్తును పోలీసులు.. దొంగల నుంచి రికవరీ చేయడాన్నే మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు వాళ్లే ఇబ్బందిలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. భలే ప్లాన్ చేశారుగా..!
Looted Money From Ps
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2021 | 11:52 AM

Share

ఇన్నాళ్లూ చోరీ చేసిన సొత్తును పోలీసులు.. దొంగల నుంచి రికవరీ చేయడాన్నే మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు వాళ్లే ఇబ్బందిలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన 8 లక్షల చోరీ కేసులో.. ఇద్దరిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. కానిస్టేబుల్‌ గంగాచలం పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. అతనే వాటిని మాయం చేసినట్టుగా నిర్ధారించుకున్నారు. గతంలో బుట్టాయిగూడెం పీఎస్లో చేసినప్పుడు కూడా గంగాచలం సస్పెండ్‌కు గురయ్యాడు. అయితే గంగాచలం ఒక్కడే చేశాడా.. అతనికి ఎవరైనా సహరించారా అన్నదానిపైనా దృష్టి పెట్టారు.

ఆ క్రమంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న గణేష్‌ ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతన్ని కూడా విచారిస్తున్నారు. పోలీసు స్టేషన్‌లో భద్రపరిచిన సొమ్మునే కొట్టేయడంతో.. పెద్ద దుమారం చెలరేగింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. కూడా వెనువెంటనే చర్యలకు ఉపక్రమించారు. మద్యం షాపులకు సంబంధించిన సొమ్ము స్టేషన్‌లో ఉండిపోయింది. వరుస సెలవులు రావడంతో.. వాటిని బ్యాంకులో వేయలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ డబ్బుపై కన్నుపడ్డ ఇంటి దొంగలు.. మాయం చేసినట్టుగా గుర్తించారు. నాలుగు మద్యం షాపులకు సంబంధించిన డబ్బును.. బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు మూడురోజుల క్రితం తెరచి చూడగా.. ఎవరో చోరీ చేసినట్టుగా నిర్ధారించుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పి.. విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే ఆ చోరీకి పాల్పడిన సొత్తులో 3.5 లక్షలను రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా మొత్తంతో పాటు చోరీలో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై పూర్తి వివరాలను ఇవాళ వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Also Read:  Kadapa district: రోజుకు 48 బాటిల్సే.. సీసా అందుకుంటే ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్.. ఏంటి గురూ ఇది

New Traffic Rules: మీ కొడుకు మైనరైనా వాహనం ఇస్తున్నారా..? అయితే మీరు కూడా జైలుకు సిద్దమవ్వండి

MLC ELECTION COUNTING LIVE: