Fire Accident: శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైల్‌లో అగ్ని ప్రమాదం.. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..

Fire Accident: శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ‌రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Fire Accident: శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైల్‌లో అగ్ని ప్రమాదం.. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..
Fire Accident In Train
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 20, 2021 | 9:53 AM

Fire Accident: శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ‌రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్‌‌లో ఆగి ఉన్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరేటర్, లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. ఆ వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. బోగీకి అంటుకున్న మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. నాలుగు ఫైరింజన్ల సహాయంతో చివరికి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే రైలు బోగీకి మంటలు అంటుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. మూడు రోజుల క్రితం ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శాతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులోని సి-4 కంపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్‌లోని కన్స్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలోనూ ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ANI Tweet:

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..

Also read:

Telangana MLC Election Results 2021 LIVE: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నాలుగో రోజు ఓట్ల లెక్కింపు

New Traffic Rules: మీ కొడుకు మైనరైనా వాహనం ఇస్తున్నారా..? అయితే మీరు కూడా జైలుకు సిద్దమవ్వండి

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?