AP Crime News: చిన్న పిల్లలను అపహరించి లైంగిక దాడులు.. ఆపై హత్యలు.. ఈ గోపి మహాకిరాతకుడు
గుంటూరు జిల్లా సంచలనం సృష్టించిన మల్లెంపూడి బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిపై లైంగిక దాడి చేసి.. గొంతు నులిమి..
గుంటూరు జిల్లా సంచలనం సృష్టించిన మల్లెంపూడి బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిపై లైంగిక దాడి చేసి.. గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మల్లెంపూడి గ్రామానికి చెందిన ఓ బాలుడు తప్పిపోయినట్లు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు.. బాలుడి ఇంటి సమీపంలోని అరటి తోట కాలువలో డెడ్ బాడీ దొరికింది. డెడ్‌బాడీపై తీవ్ర గాయాలుండటంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. మల్లెంపూడికి చెందిన గోపి అనే యువకుడు బాలుడిని హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని విచారించగా.. బాలుడిని అపహరించి, లైంగిక దాడి చేసిన తర్వాత.. గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు.
ఫిబ్రవరి 11న వడ్డేశ్వరంలో తప్పిపోయిన బాలుడిని కూడా గోపి హత్య చేసి కృష్ణానదిలో పడేశాడని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఆ బాలుడి డెడ్‌బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా భావించి, నిందితుడిపై త్వరగా ఛార్జ్ షీట్ నమోదు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామన్నారు ఎస్పీ అమ్మిరెడ్డి. గోపి లాంటి వ్యక్తి సమాజంలో తిరిగితే హానికరమని పేర్కొన్నారు ఎస్పీ. కాగా ఈ ఘటన ఉభయ తెలుగు రాష్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: Kadapa district: రోజుకు 48 బాటిల్సే.. సీసా అందుకుంటే ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్.. ఏంటి గురూ ఇది
New Traffic Rules: మీ కొడుకు మైనరైనా వాహనం ఇస్తున్నారా..? అయితే మీరు కూడా జైలుకు సిద్దమవ్వండి
Telangana MLC Elections Counting LIVE: