Kadapa district: రోజుకు 48 బాటిల్సే.. సీసా అందుకుంటే ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్.. ఏంటి గురూ ఇది
లైన్ చూశారుగా.. ఎలా ఉందో! క్వార్టర్ సీసా కోసం.. మందుబాబులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సీసా దొరకనిదే.. దాని మెడలు విరగగొట్టనిదే ఇంటికి వెళ్లమని అంటున్నారు...
లైన్ చూశారుగా.. ఎలా ఉందో! క్వార్టర్ సీసా కోసం.. మందుబాబులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సీసా దొరకనిదే.. దాని మెడలు విరగగొట్టనిదే ఇంటికి వెళ్లమని అంటున్నారు. షాపు షట్టర్ చిన్నగా ఉన్నది. మందుబాబులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు. అందుకే ఇలా రద్దీ ఏర్పడింది. కరువు రక్కసి కోరలు చాచినట్లు.. ఎన్నో రోజుల తర్వాత షెట్టర్ తెరిచినట్లు ఎగబడ్డారు. కడప జిల్లాలో కనిపించిన దృశ్యమిది. కమలాపురం మూడు రోడ్ల కూడలిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో లిక్కర్ కోసం ఎగబడుతున్నారీ మందుబాబులు.
మద్యం దుకాణాల్లో ప్రతి రోజు సాయంత్రం చీప్ లిక్కర్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ బాబులు దీని కోసం ఎగబడుతున్నారు. రోజుకు 48 బాటిళ్లు మాత్రమే ఇస్తుండడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. దీంతో చీప్ లిక్కర్ కోసం మందుబాబులు ఎగబడుతున్నారు. మద్యం అధిక రేట్లు ఉన్న కారణంగా, తక్కువ రేట్ కు వచ్చే లిక్కర్ కోసం క్యూ కట్టారు. అసలే తక్కువ రేటు బాటిల్.. ఆపై 48 బాటిల్సే ఇస్తుండటంతో షాపు ముందు పోటీ పడ్డారు. ఆ 48లో తనకు ఒక్కటి దక్కాలన్నట్లు పోటీ పడ్డారు. షాపు దగ్గర ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్న మందుబాబులు.. ప్రభుత్వం సప్లై పెంచవచ్చు కదా ప్రశ్నిస్తున్నారు. ఇంకో 48 బాటిల్స్ ఇస్తే ఏమౌతుందంటూ ప్రశ్నిస్తున్నారు. డబ్బున్న వాళ్లు.. ఎలాగూ ఎక్కువ రేటు పెట్టి మందు కొనుగోలు చేస్తారు. తమకోసం ప్రభుత్వం.. తమ కోసం సప్లై పెంచలేదా అని అంటున్నారు.
తాండూరు చైర్‌పర్సన్ దొంగ ఓటు వ్యవహారంపై ఈసీ సీరియస్.. నేరం రుజువయితే శిక్ష ఏంటంటే..?