‘ఆ అమ్మాయి నాది’ అని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు.. ఆగిపోయిన పెళ్లి.. కట్ చేస్తే.. వన్‌ సైడ్‌ లవ్‌ అట

వన్‌ సైడ్‌ లవ్‌ అంటూ ఓ అమ్మాయి జీవితాన్ని గందరగోళంలో పడేశాడు ఓ యువకుడు. నిశ్చితార్థం జరిగిన యువకుడిని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టాడు...

'ఆ అమ్మాయి నాది' అని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు.. ఆగిపోయిన పెళ్లి.. కట్ చేస్తే.. వన్‌ సైడ్‌ లవ్‌ అట
life threatening warnings
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 20, 2021 | 8:42 AM

వన్‌ సైడ్‌ లవ్‌ అంటూ ఓ అమ్మాయి జీవితాన్ని గందరగోళంలో పడేశాడు ఓ యువకుడు. నిశ్చితార్థం జరిగిన యువకుడిని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టాడు. దీంతో అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. అయితే ఇంకా తన ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పలేదని చావుకబురు చల్లగా చెప్పాడు. అతనిది వన్‌సైడ్‌ లవ్‌.. ఆ విషయం అమ్మాయికి చెప్పలేనేదు.. కానీ ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్‌ కావడానికి కారణమయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ వల్ల అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. తీరా ఎవరని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

నిజామాబాద్‌కు చెందిన వివేక్‌ కుటుంబం హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో నివసిస్తోంది. అయితే వివేక్‌ మల్కాజిగిరిలోని సఫిల్‌గూడలో ఉండే బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు. ఇంతలో అమ్మాయికి బేగంబజార్‌లోని మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. దీంతో తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోతోందని, ఎలాగైనా ఈ పెళ్లిని నిలిపివేయాలని భావించాడు. వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఇది అమ్మాయి పెళ్లి క్యాన్సిల్‌ కావడానికి దారి తీసింది.

తాను ప్రేమించిన అమ్మాయి తనకే దక్కాలని నిశ్చితార్థం అయిన అబ్బాయిని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు వివేక్‌. నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాది.. ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. కాదని నువ్వు పెళ్లికి సిద్ధమైతే చంపేస్తానని బెదిరిస్తూ పోస్ట్‌ పెట్టాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ చూసి షాకైన అబ్బాయి పేరెంట్స్‌ , ఆ అమ్మాయితో పెళ్లిని రద్దు చేసుకున్నారు.

పెళ్లి రద్దు కావడంతో అమ్మాయి పేరెంట్స్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన వ్యక్తి కోసం ఆరా తీశారు. ఈ పోస్టులు పెట్టింది బేగంబజార్‌లో ఉండే వివేక్‌ అని తేల్చారు పోలీసులు. అయితే తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనది వన్‌సైడ్‌ లవ్‌ అని చెప్పాడు వివేక్‌. తన ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పే లోపే వేరొకరితో పెళ్లి నిశ్చయమైందని, అందుకే పెళ్లి ఆపేందుకు ఇలా చేశానని చెప్పాడు వివేక్‌. చివరికి తాను తప్పు చేశానని క్షమాపణలు చెప్పాడు వివేక్‌.

Also Read:  తాండూరు చైర్‌పర్సన్‌ దొంగ ఓటు వ్యవహారంపై ఈసీ సీరియస్‌.. నేరం రుజువయితే శిక్ష ఏంటంటే..?

Tsunami: 2004 సునామీలో కోట్టుకుపోయిన పోలీసు.. 16 ఏళ్ల తరువాత ప్రత్యక్ష్యమయ్యాడు.. ఇప్పుడెలా ఉన్నాడో మీరే చూడండి..

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!