కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో మరో కొత్త ట్విస్ట్.. ఈడీ అధికారులపై కేసు నమోదు చేసిన క్రైం బ్రాంచ్‌ పోలీసులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్‌స్కామ్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులపై కేరళ క్రైంబ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో మరో కొత్త ట్విస్ట్.. ఈడీ అధికారులపై కేసు నమోదు చేసిన క్రైం బ్రాంచ్‌ పోలీసులు
Kerala Gold Smuggling Case
Follow us

|

Updated on: Mar 19, 2021 | 9:25 PM

Kerala gold smuggling case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్‌స్కామ్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులపై కేరళ క్రైంబ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ చేత బలవంతంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును చెప్పించారని క్రైంబ్రాంచ్‌ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికను ఎర్నాకుళం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్-2లో దాఖలు చేశారు. తనను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని స్వప్వ సురేశ్‌ విడుదల చేసిన ఆడియో క్లిప్పింగ్‌ను కూడా కోర్టుకు సమర్పించారు.

గోల్డ్ స్కాంలో హవాలా కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను ప్రశ్నించారని క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ తెలిపింది. ఈ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఇరికించే ఉద్దేశంతో ఆయన పేరును చెప్పే విధంగా స్వప్నను నిర్బంధించారని పేర్కొంది. కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ముఖ్యమంత్రికి హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు దస్తావేజును తయారు చేశారని పేర్కొంది. తప్పు చేసే విధంగా ప్రేరేపించారని, తప్పుడు స్టేట్‌మెంట్‌ను పొందుపర్చారని తెలిపింది.

జులై 5న త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్‌ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్‌ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్‌ జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. స్మగ్లింగ్‌ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివశంకర్‌ అండగా ఉన్నారని కేసు నమోదు అయ్యింది. ఆమెను ఈ కేసు నుంచి తప్పించడానికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపణలొచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శివశంకర్‌ను విధుల నుంచి తప్పించింది.

అయితే ఈ కేసును చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు సీఎం విజయన్‌.. కస్టమ్స్‌ , ఈడీ అధికారుల తీరును ప్రశ్నిస్తూ ఆయన ఘాటైన లేఖ కూడా రాశారు. రాజకీయ లబ్ది కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థలు లెఫ్ట్‌ నేతలను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తప్పకుంగా గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

Read Also…  తీగ లాగితే డొంక కదులుతోంది.. గసగసాల సాగుతో ఘాటు దందా.. రంగారెడ్డి జిల్లాలో బయటపడ్డ ఓపీఎం పంటసాగు