తీగ లాగితే డొంక కదులుతోంది.. గసగసాల సాగుతో ఘాటు దందా.. రంగారెడ్డి జిల్లాలో బయటపడ్డ ఓపీఎం పంటసాగు

పంట పొలాల మాటున మత్తు మందు పండుతోంది. రైతులను పావులుగా వాడుకుంటూ చీకటి దందా కొనసాగిస్తున్నారు. అధిక డబ్బు ఆశతో పంటసాగు చేసిన అన్నదాతలు జైలుపాలవుతున్నారు.

తీగ లాగితే డొంక కదులుతోంది.. గసగసాల సాగుతో ఘాటు దందా.. రంగారెడ్డి జిల్లాలో బయటపడ్డ ఓపీఎం పంటసాగు
Rachakonda Police Seized Poppy Fruits
Follow us

|

Updated on: Mar 19, 2021 | 9:04 PM

police seized poppy fruits : పంట పొలాల మాటున మత్తు మందు పండుతోంది. రైతులను పావులుగా వాడుకుంటూ చీకటి దందా కొనసాగిస్తున్నారు. అధిక డబ్బు ఆశతో పంటసాగు చేసిన అన్నదాతలు జైలుపాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో తీగ లాగితే.. తెలంగాణలో డొంక కదులుతోంది. డ్రగ్‌ మాఫియా ఆగడాలపై అలర్ట్‌ అయిన పోలీసులు.. పంట పొలాలపై కన్నేశారు. ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ.. మత్తు పంట రాయుళ్లకు చెక్‌ పెడుతున్నారు. తాజాగా దాదాపు 20 లక్షల విలువ చేసే సరుకును సీజ్‌ చేశారు.

చిత్తూరు జిల్లా మదనపల్లిలో బయటపడ్డ మత్తు పంట సంచలనం సృష్టిస్తోంది. మండలంలోని మాలేపాడు, పెంచుపాడు అడవులు, పొలాల్లో సోదాలు చేశారు. టమాటా పంట మాటున గసగసాల పంట సాగవుతుందని తేల్చారు. మాలేపాడు దేవళంపల్లెలో 15 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేసిన 15వేల మొక్కలను, మూడు బస్తాల కాయలను ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ఈ పంటను జోరుగా సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తాజాగా ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. ఇక్కడ కూడా అనే నిషేధిత మొక్కలను పెంచుతున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరులో లీజుకు తీసుకున్న పొలంలో ఓపియంను పండిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరులో లీజుకు తీసుకున్న రెండు ఎకరాల పొలంలో నిషేధిత ఓపియం మొక్కలను పెంచుతున్న చెన్నకేశవులును పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు తరలించడానికి సిద్ధంగా ఉన్న 390 కిలోల ఓపీఎం కాయలను పట్టుకున్నారు. 390 కిలోల ఓపియం విలువ దాదాపు రూ.20 లక్షలు ఉంటుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. ప్రధాన నిందితుడు వెంకటరమణను చిత్తూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అరెస్ట్ చేసిందని సీపీ తెలిపారు.

ఇదిలావుంటే, అనంతపూర్ జిల్లాకు చెందిన చెందిన చెన్నకేశవులు రంగారెడ్డి జిల్లా లేమూరులోని బుచ్చిరెడ్డి అనే వ్యక్తి వద్ద పొలం లీజుకు తీసుకుని ప్రధాన నిందితుడు వెంకట రమణ సహకారంతో గసగసాలను పండిస్తున్నారు. రహస్యంగా అందిన సమాచారంతో ఇక్కడ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది కిలోకు 3 వేల నుంచి 5 వేలు విలువ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో తయారు చేసి ఆంధ్రా నుంచి కర్ణాటకకు అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. ఒక గ్రామ్ హెరాయిన్‌ను 32 మిల్లీ గ్రాముల మార్టిన్‌తో కలిపి తయారు చేస్తున్నారని తెలిసింది. సెక్షన్ 18-బీ.. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసు కమిషనర్ తెలిపారు.

Read Also..  Snake: కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. బాటిల్లో పాము పిల్ల దర్శనం.. వీడియో వైరల్