Telangana Budget: అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్ ఏర్పాటు పరిశీలనలో ఉంది.. శాసనమండలిలో హరీశ్ రావు
Telangana Budget: రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా..
Telangana Budget: రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ పురాణం సతీష్ శాసన మండలిలో ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫున మంత్రి సమాధానం ఇచ్చారు.
ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కమిటీ వేసిందని, నివేదిక వచ్చిన అనంతరం సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా ట్రిబ్యునళ్లు ఉన్నాయని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక లాభ నష్టాలపై పూర్తిస్థాయి చర్చ అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ట్రిబ్యునల్ ఎందుకు అవసరం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సి ఉండగి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వ, స్థానిక సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన నియామకం, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు, వేతన స్థిరీకరణ, ఇతర సేవా నిబంధనలకు సంబంధించిన సమస్యలను చట్ట, న్యాయ పరిధిలో పరిష్కరించటానికి ఆదేశాలు జారీ చేయడానికి ప్రత్యేక న్యాయ వ్యవస్థ అవసరం ఉంటుంది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా, పదోన్నతులలో, బదిలీల్లో అన్యాయం జరిగిందని భావించినవారు ట్రిబ్యునల్‌ని ఆశ్రయిస్తారు. ఒకవేళ ట్రిబ్యునల్‌లో ఉద్యోగులు గెలిస్తే ప్రభుత్వం లేదా ప్రభుత్వం గెలిస్తే ఉద్యోగులు ట్రిబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తారు. ఎలాగైనా హైకోర్టుకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ట్రిబ్యునల్ ఉన్నా లేకున్నా ఒకటేననే వాదన కూడా ఉంది.
ఆరు సూత్రాల పథకానికి వ్యతిరేకంగా ఏమైనా బదిలీలు, నియామకాలు జరిగినప్పుడు మాత్రమే బాధితులు న్యాయం కోసం ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేశారు, కానీ ఉద్యోగులు ప్రతి సర్వీసు సమస్యకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వం వాదన. ఆరు సూత్రాల పథకం పునాదిగా, 1974 మే నెలలో పార్లమెంట్ 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజ్యాంగంలో ఆర్టికల్ 371(డి)లో 3వ విభాగం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటానికి గాను ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి సంబందించి ప్రత్యేక అడ్మినిష్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిం ఉంది. ఇదే అంశంపై బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కమిటీ వేసిందని, నివేదిక వచ్చిన అనంతరం సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Read More:
Telangana Budget: వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోలేదా..? అయితే మీ కార్డు క్యాన్సెల్
AP Municipal Electons: విశాఖ టీడీపీలో చిచ్చు.. గెలిచి వారమైనా కాలేదు.. జంపింగ్ జపాంగ్ షురూ