పాక్ సహా మరో మూడు దేశాల మహిళలను పెళ్లాడకుండా సౌదీ పురుషులకు నిషేధం, కొత్త రూల్

తమ దేశంలోని పురుషులకు   సౌదీ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. వీరు పాకిస్తాన్,  బంగ్లాదేశ్, చాద్,  మయన్మార్ దేశాల మహిళలను పెళ్లాడరాదని బ్యాన్ విధించింది. ప్రస్తుతం సౌదీలో...

  • Umakanth Rao
  • Publish Date - 1:14 pm, Sat, 20 March 21
పాక్ సహా మరో మూడు దేశాల మహిళలను పెళ్లాడకుండా సౌదీ పురుషులకు నిషేధం,  కొత్త రూల్
Saudi  Arabia Prohibits  Men From Marrying From Pakistan And Other 3 Nations

తమ దేశంలోని పురుషులకు   సౌదీ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. వీరు పాకిస్తాన్,  బంగ్లాదేశ్, చాద్,  మయన్మార్ దేశాల మహిళలను పెళ్లాడరాదని బ్యాన్ విధించింది. ప్రస్తుతం సౌదీలో  ఈ నాలుగు దేశాలకు చెందిన సుమారు 5 లక్షలమందికి పైగా  మహిళలున్నారు. ఈ విదేశీ  మహిళలను పెళ్లి చేసుకోగోరిన వారెవరైనా  కఠినతరమైన రూల్స్ ని పాటించాల్సి ఉంటుంది.  మక్కా పోలీసు డైరెక్టర్ మేజర్  జనరల్  ఆసఫ్ అల్-ఖురేషీని  ఉటంకిస్తూ ‘మక్కా డైలీ’ ఈ విషయాన్ని వెల్లడించింది.  విదేశీ మహిళలను వివాహం చేసుకోకుండా తమ దేశ మగవారిని నివారించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఈ మహిళలను  పెళ్లి చేసుకోగోరేవారు మొదట ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత అధికారికంగా తమ మ్యారేజీ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. కానీ అప్పటికే విడాకులు తీసుకున్నవారు  అలా డైవోర్స్ తీసుకున్న ఆరు నెలల్లోగా దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దరఖాస్తుదారులు 25 ఏళ్లకు పైబడినవారై ఉండాలని, స్థానిక జిల్లా మేయర్ సంతకం చేసిన డాక్యుమెంట్లను, ఇతర పత్రాలను అందజేయవలసి ఉంటుందని పేర్కొంది. అలాగే వారి ఫ్యామిలీ  కార్డు కూడా తప్పనిసరి అట.. దరఖాస్తుదారునికి ఇదివరకే పెళ్లయి ఉంటే తన భార్య దివ్యాంగురాలనో,  లేదా  దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతోందనో, లేక సంతానానికి అర్హురాలు కాదనో నిరూపించే ఆసుపత్రి డాక్యుమెంట్లను కూడా అందజేయాల్సి ఉంటుంది. సౌదీ ప్రభుత్వం ఉన్న్నట్టుడి ఈ కఠినతరమైన రూల్ ని ఎందుకు తెచ్చిందో తెలియక అక్కడి పురుషులు అయోమయం చెందుతున్నారు. కేవలం దేశ మహిళలనే వివాహం చేసుకునేలా మగవారిని ప్రోత్సహించడమే దీని ధ్యేయంగా కనబడుతోందని అంటున్నారు. బహుశా పాకిస్థాన్ సహా ఈ దేశాల రాజకీయ పరిణామాల ప్రభావం ఇందుకు దోహదపడి ఉండవచ్చునని భావిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :మార్స్ పై నీటిజాడ..గురించి సంచలన నిజాలు వెల్లడించిన నాసా : water on Mars Videoప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video.