AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా వ్యాక్సిన్ తీసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, కరోనా వైరస్ పాజిటివ్ తో పరేషాన్

చైనా మేడ్  కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. ఈ విషయాన్ని నేషనల్ సర్వీసెస్ పై గల ఆయన స్పెషల్  అసిస్టెంట్ ఫైసుల్ సుల్తాన్ ట్వీట్ చేశారు.

చైనా వ్యాక్సిన్  తీసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, కరోనా వైరస్ పాజిటివ్ తో పరేషాన్
Pakistan Pm Imran Khan
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 20, 2021 | 4:52 PM

Share

చైనా మేడ్  కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. ఈ విషయాన్ని నేషనల్ సర్వీసెస్ పై గల ఆయన స్పెషల్  అసిస్టెంట్ ఫైసుల్ సుల్తాన్ ట్వీట్ చేశారు. చైనాలో తయారైన సైనోఫామ్  వ్యాక్సిన్ తొలి డోసును ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 18 న తీసుకున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఈ వ్యాక్సిన్ ఒక్కటేఅందుబాటులో  ఉంది.  ఫిబ్రవరి 1 న చైనా తొలి విడతగా  తమ సైనోఫామ్ వ్యాక్సిన్ 5 లక్షల  డోసులను పాక్ కి పంపింది. ఆ మరుసటి రోజునుంచే పాక్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయింది. ఈ నెల  17 న చైనా ఈ దేశానికి తమ రెండో విడత సైనోఫామ్ టీకామందును పంపింది.  కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం స్వీయ నియంత్రణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

పాకిస్తాన్ లో 6,23,135 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 13,799 మంది కరోనా రోగులు మృతి చెందారు. తమకు ఇండియా నుంచి వ్యాక్సిన్లు అవసరమని లోగడ పాక్ కోరింది. ఈ నెల 10 న ఇండియా నుంచి 45 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను ఆ దేశానికి పంపారు. అయితే ఇందుకు పాక్ నుంచి భారత్ కు ఎలాంటి స్పందన లేదు. బ్రెజిల్,  ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత వ్యాక్సిన్ ను అందుకున్నవెంటనే ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేశాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Gold Stocks: బంగారమంటే మోజే మోజు.. తమిళనాడు ఎన్నికల్లో అంతా గోల్డు మయమే.. ఎవరిదగ్గరెంతంటే?

Japan Earthquake : ఈశాన్య జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ