రాహుల్ గాంధీ, రవుల్‌ విన్సీ… ఇంతకు ఏ పేరు కరెక్ట్..?

ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. అమేథీలో దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రంపై అభ్యంత‌రాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రాహుల్ నామినేష‌న్ ప‌త్రాల త‌నిఖీని ఆ నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. రాహుల్ అభ్యర్థిత్వంలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్‌ లాల్ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ అధికారి ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై లాల్ తరఫు న్యాయవాది రవి ప్రకాష్ మాట్లాడుతూ, తాము ప్రధానంగా మూడు […]

రాహుల్ గాంధీ, రవుల్‌ విన్సీ... ఇంతకు ఏ పేరు కరెక్ట్..?
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 4:51 PM

ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. అమేథీలో దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రంపై అభ్యంత‌రాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రాహుల్ నామినేష‌న్ ప‌త్రాల త‌నిఖీని ఆ నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. రాహుల్ అభ్యర్థిత్వంలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్‌ లాల్ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ అధికారి ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై లాల్ తరఫు న్యాయవాది రవి ప్రకాష్ మాట్లాడుతూ, తాము ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించినట్టు చెప్పారు. బ్రిట‌న్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ ప్రకారం.. రాహుల్‌కు బ్రిటిన్ పౌర‌స‌త్వం ఉన్నట్లు తెలుస్తున్నద‌ని, అంటే భారత దేశంలో రాహుల్ పౌరుడు కాదు అని, అందుకే ఆయ‌న ఎన్నిక‌ల‌కు అన‌ర్హుడు అంటూ న్యాయ‌వాది ర‌విప్రకాశ్ ఆరోపించారు. అంతేకాక ఆయన స‌మ‌ర్పించిన విద్యార్హత ప‌త్రాల్లోనూ అనేక త‌ప్పులు ఉన్నాయ‌ని.. కాలేజీలో ఆయన పేరు ‘రవుల్ విన్సీ’ అని ఉందని, రాహుల్ గాంధీ పేరుతో ఎలాంటి సర్టిఫికెట్ లేదని  ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ, రవుల్ విన్సీ ఒక వ్యక్తేనా అనేదే మా ప్రశ్న అని అన్నారు. అలాకాకుంటే ఆయన ఒరిజనల్ సర్టిఫికెట్ ఇస్తే వెరిఫై చేయడానికి వీలుంటుంది’ అని రవిప్రకాష్ అన్నారు.