ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా అజిత్ తొలగింపు

మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. కొత్తగా డిప్యూటీ సిఎం గా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను పార్టీ లెజిస్లేటివ్ నాయకత్వ పదవి నుంచి తొలగించారు. ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్.. బీజేపీకి మద్దతునివ్వాలని తన మేనల్లుడు తీసుకున్న నిర్ణయంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని మళ్ళీ స్పష్టం చేశారు. ఆయనను పార్టీ లెజిస్లేటివ్ నేతగా తొలగించినట్టు పేర్కొన్నారు. అటు- తనకు మద్దతునిస్తున్నట్టు చెబుతున్న 54 మంది ఎమ్మెల్యేల పేర్ల జాబితాను […]

ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా అజిత్ తొలగింపు
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 3:02 PM

మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. కొత్తగా డిప్యూటీ సిఎం గా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను పార్టీ లెజిస్లేటివ్ నాయకత్వ పదవి నుంచి తొలగించారు. ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్.. బీజేపీకి మద్దతునివ్వాలని తన మేనల్లుడు తీసుకున్న నిర్ణయంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని మళ్ళీ స్పష్టం చేశారు. ఆయనను పార్టీ లెజిస్లేటివ్ నేతగా తొలగించినట్టు పేర్కొన్నారు. అటు- తనకు మద్దతునిస్తున్నట్టు చెబుతున్న 54 మంది ఎమ్మెల్యేల పేర్ల జాబితాను అజిత్ పవార్.. గవర్నర్ కు సమర్పించినట్టు తెలుస్తోంది. పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు శరద్ పవార్ కే సపోర్ట్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే..