Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ సూచనతో వ్యాక్సిన్ తీసుకున్న మధ్యప్రదేశ్ వాసి.. ‘మన్ కీ బాత్’ లో ‘ప్రస్తావన’ !

వ్యాక్సిన్ పై అనుమానాలు, అపోహలు, భయాలు వద్దని,ఏ సందేహమూ లేకుండా టీకామందు తీసుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన సూచనతో మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా వ్యాక్సిన్ తీసుకున్నాడు.

ప్రధాని మోదీ సూచనతో వ్యాక్సిన్ తీసుకున్న మధ్యప్రదేశ్ వాసి.. 'మన్ కీ బాత్' లో  'ప్రస్తావన' !
Narendra Modi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 27, 2021 | 6:31 PM

వ్యాక్సిన్ పై అనుమానాలు, అపోహలు, భయాలు వద్దని,ఏ సందేహమూ లేకుండా టీకామందు తీసుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన సూచనతో మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలోని బేతూర్ జిల్లా దులారియా గ్రామ వాసులతో మోదీ కొద్దిసేపు సంభాషించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సురక్షితంగా ఉండవచ్చునని అన్నారు.. జ్వరం వస్తుందనో , ఒంటినొప్పులు వస్తాయనో భయాన్ని వీడాలన్నారు. వదంతులను నమ్మవద్దన్నారు. దీంతో రాజేష్ హిరావే అనే 43 ఏళ్ళ వ్యక్తి తన కుటుంబంతో బాటు టీకామందు తీసుకున్నాడు. ఈ గ్రామవాసుల్లో మరికొందరిని కూడా ప్రోత్సహించాడు. రాజేష్ తో మోదీ మాట్లాడిన ఉదంతం ఆదివారం నాటి ఆయన ‘మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసారమైంది. ప్రధానితో తాను మాట్లాడడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, రాజేష్ అన్నాడు. తమ గ్రామానికి చెందిన సుమారు 127 మంది కూడా టీకామందు తీసుకున్నట్టు ఆయన చెప్పాడు. కాగా కిషోరీ లాల్ దురావే అనే వృధునితో కూడా మోదీ మాట్లాడారు. ఆయన సూచనపై తన తండ్రి వ్యాక్సిన్ తీసుకున్నాడని, అలాగే తనతో బాటు అనేకమంది కూడా తీసుకున్నారని దురావే కొడుకు తెలిపాడు.

తాను. 100 ఏళ్ళ తన తల్లి సైతం వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని మోదీ వారికి గుర్తు చేశారు. కోవిద్ ముప్పు ఇంకా ఉందని, వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడమే గాక.. కోవిద్ ప్రొటొకాల్స్ ని కూడా అలాగే పాటించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచితంగా టీకామందు ఇచ్చే కార్యక్రమం చేపట్టిందన్నారు. జూన్ 21 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందన్నారు. కోవిద్ కి సంబంధించిన వివిధ వేరియంట్ల గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఫైర్ ఇంజనీర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ముగుస్తోంది.. అప్లై చేసుకున్నారా?

Revanth Reddy: కేసీఆర్ అధికారానికి కారణమదే!.. చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..