Corona Cases India: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి.. ఎంత మంది మరణించారంటే.
Corona Cases India: కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో అలజడి రేగిన విషయం తెలిసిందే. రోజుకు ఏకంగా మూడున్నర లక్షల కేసులు నమోదైన రోజులు కూడా చూశాం. అయితే తాజాగా కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిపిస్తోంది....
Corona Cases India: కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో అలజడి రేగిన విషయం తెలిసిందే. రోజుకు ఏకంగా మూడున్నర లక్షల కేసులు నమోదైన రోజులు కూడా చూశాం. అయితే తాజాగా కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిపిస్తోంది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం, కఠిన నిబంధనలను అమలు చేయడంతో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుతున్నాయి. రోజు వారి కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,040 కేసులు నమోదుకాగా 1258 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఏకంగా 57,944 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. అయితే మొన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య కాస్త పెరగడం గమనార్హం. ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,02,33,183 మంది కరోనా బారిన పడగా.. 2,92,51,029 కోలుకున్నారు. ప్రస్తుతం 5,86,403 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకి.. 3,95,751 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.75% మరణాల రేటు 1.31%. గా ఉంది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 32,17,60,077 మందికి కరోనా టీకాలు అందించారు.