KA Paul : చైనాకు ఇవ్వాల్సిన అప్పులు చెల్లించకండి.. ప్రపంచ దేశాలకు కేఏ పాల్ పిలుపు, పీఎం మోడీ, సీఎం జగన్ పై కామెంట్స్
కరోనా మహమ్మారికి మూల కారణం చైనా యేనని ప్రముఖ శాంతి ప్రవక్త కేఏ పాల్ అన్నారు. కరోనా వైరస్ వల్ల అన్ని దేశాలూ ట్రిలియన్ డాలర్లలో నష్టపోతే, ఒక్క చైనా మాత్రమే లబ్దిపొందిందని..
KA Paul : కరోనా మహమ్మారికి మూల కారణం చైనా యేనని ప్రముఖ శాంతి ప్రవక్త కేఏ పాల్ అన్నారు. కరోనా వైరస్ వల్ల అన్ని దేశాలూ ట్రిలియన్ డాలర్లలో నష్టపోతే, ఒక్క చైనా మాత్రమే లబ్దిపొందిందని పాల్ చెప్పారు. ఇంతటి విపత్తుకు కారణమైన చైనాకు ప్రపంచ దేశాలు ఇవ్వాల్సిన అప్పులు తిరిగి చెల్లించకూడదని అని ప్రపంచ దేశాలకు కేఏ పాల్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేఏ పాల్ టీవీ9తో మాట్లాడారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో ఘోరంగా విఫలయయ్యారని పాల్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని పాల్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని అన్ని ఘటనలూ తాను ముందే చెప్పినట్టు జరుగుతుండటం మనం చూస్తున్నామని పాల్ అన్నారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి అనేక అంశాలపై మాట్లాడిన పాల్ ఏమంటున్నారో.. ఆయన మాటల్లోనే ఈవీడియోలో చూద్దాం..
Read also : Bhatti : ‘ఒక దళిత ఎమ్మెల్యేగా నేను మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా..! శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా.!’