Bhatti : ‘ఒక దళిత ఎమ్మెల్యేగా నేను మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా..! శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా.!’

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బి-టీం అంటున్న బీజేపీ నేతకు సిగ్గుండాలని..

Bhatti : 'ఒక దళిత ఎమ్మెల్యేగా నేను  మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా..!  శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా.!'
Bhatti Vikramarka
Follow us

|

Updated on: Jun 26, 2021 | 8:12 PM

Bhatti serious on BJP B-team Comments : తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బి-టీం అంటున్న బీజేపీ నేతకు సిగ్గుండాలని ఆయన అన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేగా నేను మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా.. శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా.. అంటూ ఫైరయ్యారు భట్టి విక్రమార్క. సిద్దిపేటకు వెళ్లి హరీష్ రావు కు, అసెంబ్లీ లో సీఎం కు ఎందుకు పిటిషన్ లు ఇచ్చావు..? అని ప్రశ్నించిన భట్టి దళితుల కోసం మేము ఎందాకైనా పోరాడుతాం, ఎవరినైనా కలుస్తాం అని తేల్చి చెప్పారు. ఇలా..  మాజీ ఎంపీ వివేక్, బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్లకు కౌంటరిచ్చారు భట్టి.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు, లాకప్ డెత్ లు పెరిగాయని భట్టి కామెంట్ చేశారు. “పోలీస్ ల దెబ్బలకు తట్టుకోలేక మరియమ్మ మరణించింది. దీని పై మేము గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి రావాలని ఆహ్వానించారు…

దళితుల మీద దాడులు చేస్తూ సమావేశానికి రమ్మంటే ఎందుకు రావాలని నిలదీశాను. దాంతో సీఎం మమ్మల్ని కలవడానికి అవకాశం ఇచ్చారు.” అని సీఎంతో మీటింగ్ మీద స్పష్టత నిచ్చారు భట్టి విక్రమార్క. దళితుల మీద దాడులు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తాము ఈ సందర్భంగా సీఎం ను కోరామని భట్టి తెలిపారు.

Read also : Raghunandan rao : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS B-team గా కాంగ్రెస్ పనిచేయబోతోంది : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Veerabrahmendra swami muth : ఏపీ ఎమ్మెల్యే vs కర్ణాటక ఎమ్మెల్యేగా టర్న్ తీసుకున్న బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం