AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghunandan rao : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS B-team గా కాంగ్రెస్ పనిచేయబోతోంది : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS B-team గా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారన్న ఆ పార్టీ..

Raghunandan rao : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS B-team గా కాంగ్రెస్ పనిచేయబోతోంది : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
Raghunandan-Rao
Venkata Narayana
|

Updated on: Jun 26, 2021 | 6:45 PM

Share

BJP MLA Raghunandan rao : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS B-team గా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారన్న ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మాటలు నిజమయ్యాయన్నారు. ఓట్ల‌ బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ లో ఓటమి భయంతోనే ఈటల పేరుతో తప్పుడు లేఖలు రాస్తున్నారని రఘునందన్ రావు తెలిపారు.

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వలేదని బాల్క సుమన్ స్వయంగా ఒప్పుకున్నాడని రఘునందన్ రావు అన్నారు. కొడుకు లాంటి ఈటల పట్ల సీఎం పవర్తించిన తీరు ఎలా ఉందో బాల్కా సుమనే చెప్పాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే హుజురాబాద్ లో పునరావృతం అవుతుందని తేల్చి చెప్పారు రఘునందన్ రావు. బాల్కా సుమన్ కాదు..కేసీఆర్ కుటుంబానికి బానిస సుమన్ అని అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.

కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదన్న విషయం బాల్కా సుమన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఢిల్లీలో సుష్మా స్వరాజ్ వెనుక చేతులు కట్టుకుని కేసీఆర్ తిరిగిన విషయం విజయశాంతికి మాత్రమే తెలుసునన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులే అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు లేవు కాబట్టి.. ఆంధ్రోళ్ల ఓట్లు అవసరం లేదని..మరో సారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు విమర్శించారు. రోజా ఇంట్లో భోజనం చేసినప్పుడు రాక్షసులని కేసీఆర్ కు తెలియదా? ప్రగతి భవన్లో అలయ్ బలయ్ ఇచ్చినప్పుడు రాక్షసులని మంత్రి ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కు తెలియదా? ఎన్నికను బట్టి సీమాంధ్రులపై టీఆర్ఎస్ విమర్శలు మారుతుంటాయన్నారు రఘునందన్ రావు.

Read also : Hyderabad: హైదరాబాద్‌లోని కోకాపేట్‌కు మహర్ధశ.. HMDA కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు