Hyderabad: హైదరాబాద్‌లోని కోకాపేట్‌కు మహర్ధశ.. HMDA కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు

దేశంలో అత్యున్నత నగరాలకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని పురపాలక శాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) కమిషనర్ అర్వింద్ కుమార్ చెప్పారు...

Hyderabad: హైదరాబాద్‌లోని కోకాపేట్‌కు మహర్ధశ.. HMDA కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు
Kokapet Interchange
Follow us
Venkata Narayana

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 25, 2021 | 7:59 PM

kokapet e auction pre bid meeting : దేశంలో అత్యున్నత నగరాలకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని పురపాలక శాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) కమిషనర్ అర్వింద్ కుమార్ చెప్పారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐసిఐసిఐ టవర్స్‌లో‌ జరిగిన “కోకాపేట్ ఈ- ఆక్షన్ ఫ్రీ బిడ్ మీటింగ్” కు హాజరైన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, డెవలపర్స్ లను ఉద్దేశించి అర్వింద్ కుమార్ మాట్లాడారు. ఎలాంటి జోనల్ రిస్ట్రిక్షన్స్ లేని మల్టీ యూజ్ జోన్ “కోకాపేట్ హెచ్ఎండిఎ లేఅవుట్” అని ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ తెలిపారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు.

వంద అడుగుల రోడ్లు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్ వ్యవస్థలతో అధునాతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లను కోకాపేట్ లో కల్పిస్తున్నట్లు అర్వింద్ కుమార్ చెప్పారు. ఇప్పటికే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా కోకాపేట్ ఏరియాకు ముద్ర పడిందని, వచ్చే రెండు దశాబ్దాల కాలంలో కోకాపేట్ పరిసరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5.3 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ట్రాన్స్ కో కు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో 400/220/132/33 కెవి సామర్ధ్యం సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు.

కోకాపేట్ లేఅవుట్ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం కొల్లూరు నుంచి ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్ ఏర్పాట్లు జరుగుతాయని అర్వింద్ కుమార్ చెప్పారు. వాటర్ వర్క్స్ బోర్డు పంప్ హౌస్ నిర్మాణానికి 9.30 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఅర్అర్) నుంచి కోకాపేట్ లేఅవుట్ లోకి నేరుగా వాహనాలు చేరుకునేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నట్లు అర్వింద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో కోక పేట లేఅవుట్ లో వచ్చే బహుళ అంతస్తుల నిర్మాణాలు, అందులో పని చేసే ఉద్యోగులు, అక్కడి జనసాంద్రతతకు అనుగుణంగా ట్రంపెట్ నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు అర్వింద్ కుమార్ వివరించారు.

Read also : Santhanu Clinics : “శంతను” క్లినిక్స్ ప్రారంభించిన త్రిదిండి చిన్నజీయర్ స్వామి, మైహోం గ్రూప్ చైర్మన్ రామేశ్వర్ రావు

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత