AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: పేద వాళ్ల గురించి నిరంతరం తపించిన వ్యక్తి వైఎస్ఆర్.. తెలంగాణలో ఆరోగ్య శ్రీ లేదన్న వైఎస్ షర్మిల..

YS Sharmila: రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిని వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి...

YS Sharmila: పేద వాళ్ల గురించి నిరంతరం తపించిన వ్యక్తి వైఎస్ఆర్.. తెలంగాణలో ఆరోగ్య శ్రీ లేదన్న వైఎస్ షర్మిల..
Sharmila
Shiva Prajapati
|

Updated on: Jun 25, 2021 | 5:26 PM

Share

YS Sharmila: రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిని వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాల గొప్పతనాన్ని పేర్కొంటూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. పేదవాళ్ల కోసం వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన షర్మిల తిరుగు పయనంలో ఓ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని చూసి ఆగారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆమె పలు కామెంట్స్ చేశారు. పేద వాళ్ల శ్రేయస్సు కోసం తనతండ్రి నిరంతరం తపించారని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీ పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. వైఎస్ఆర్ ఆలోచించినట్లు ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచించలేదన్నారు. తన తండ్రిది పెద్ద మనసు అని కీర్తించారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన పథకం ఆరోగ్య శ్రీ పథకం అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై తెలంగాణ ప్రభుతవంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ అందడం లేదన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. పేద వాళ్ళను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వస్తే నిజాలు తెలుస్తాయన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తే లాభం లేదన్నారు. కరోనా వస్తే కేసీఆర్ మాత్రం యశోద ఆస్పత్రికి వెళ్తారని, పేదవారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా? అని ప్రశ్నించారు. మీకో న్యాయం.. పేద వారికి ఓ న్యాయమా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిల ఫైర్ అయ్యారు. కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also read:

H1B Visa: హెచ్‌-1బీ వీసా దారుల‌కు గుడ్ న్యూస్‌.. వీసా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన వారికి మరో అవ‌కాశం ఇస్తూ..

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం