AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santhanu Clinics : “శంతను” క్లినిక్స్ ప్రారంభించిన త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోం గ్రూప్ చైర్మన్ రామేశ్వర్ రావు

హైదరాబాద్ ఖాజాగూడ లో "శంతను " మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ & డయాగ్నస్టిక్స్ సెంటర్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదిండి చిన్న జీయర్ స్వామి ఇవాళ ప్రారంభించారు..

Santhanu Clinics : శంతను క్లినిక్స్ ప్రారంభించిన త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోం గ్రూప్ చైర్మన్ రామేశ్వర్ రావు
Santanu Clinic
Venkata Narayana
| Edited By: Narender Vaitla|

Updated on: Jun 25, 2021 | 8:13 PM

Share

హైదరాబాద్ ఖాజాగూడ లో “శంతను ” మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ & డయాగ్నస్టిక్స్ సెంటర్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఇవాళ ప్రారంభించారు. ఈ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా, చిన్న జీయర్ స్వామితో పాటు… మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు, అహోబిల స్వామి తదితర ప్రముఖలు హాజరయ్యారు. అధునాతన సౌకర్యాలతో ఎం. డి డాక్టర్ అభినవ్ రావు తంగేడు క్లినిక్ ప్రారంభించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి అన్నారు. కరోనా విపత్తు దృష్ట్యా 30 శాతం రాయితీతో మొత్తం 16 రకాల సేవలతో పాటు… ఆయుర్వేద, హోమియోపతి వైద్యాన్ని ప్రజలకు ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యానించారు. ఈ కరోనా కష్ట కాలంలో ఇలాంటి క్లీనిక్స్ చాలా అవసరమని, అందరూ దీనిని ఉపయోగించుకోవాలని చిన్నజీయర్ స్వామి సూచించారు.

Chinna Jeeyar Swamiji And M

Chinna Jeeyar Swamiji And M

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, అహోబిల స్వామి ఆశీస్సులతో “శంతను” క్లినిక్ ప్రారంభించడం సంతోషంగా ఉందని మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వర్ రావు ఈ సందర్భంగా చెప్పారు. కరోనా నేపథ్యంలో 90% పేషెంట్స్ కి నార్మల్ ట్రీట్మెంట్, 10% పేషెంట్స్ కి క్రిటికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటున్న తరుణంలో ఇలాంటి క్లీనిక్ అందుబాటులోకి రావడం ఆనందకరమని రామేశ్వర్ రావు అన్నారు. చాలా అనుకూలమైన ఫీజులతో ఈ క్లినిక్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నట్టు రామేశ్వర్ రావు చెప్పారు. “శంతను” క్లినిక్ లో మంచి డాక్టర్స్ ఉన్నారని, మంచి సేవ అందిస్తారని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వర్ రావు తెలియజేశారు.

ఈ క్లినిక్ డాక్టర్ అభినవ్ ప్రారంభించడం సంతోషం.. చక్కని సౌకర్యాలతో ఈ క్లినిక్ తీసుకువచ్చారని అహోబిల స్వామి తెలిపారు. మంచి సేవ రావాలి, మంచి చేతుల ద్వారా రావాలి అన్నది నిజం అనుకుంటా.. అందుకే అభినవ్ ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు అని ఆయన అన్నారు. కొంత మంది కొన్ని ప్రోటోకాల్స్ చెప్తున్నారు, అవి పని చేస్తాయా…? పని చేస్తే ఎంత వరకు పని చేస్తాయ్.? అన్నది ఎవరూ చెప్పలేరు. ఏ ఏరియంట్ అయినా ఉందా, లేదా అని తెలుసుకోవడానికి ఇలాంటి క్లినిక్స్ పని కొస్తాయి అని అహోబిల స్వామి అభిప్రాయపడ్డారు.

Santhanu Clinics

Santhanu Clinics

డ్రగ్ ఎంత గొప్పదైనా, వైద్యులు ఎంత గొప్ప వారైనా పేషెంట్స్ లో మనోబలం కావాలి. పేషెంట్స్ లో మనోబలం పెంచడానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో అవకాశాలు ఉండవు కనుక ఇలాంటి డాక్టర్స్ అవసరమని ఈ సందర్భంగా ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అందుకే చిన్న స్థాయిలో సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా క్లినిక్స్ ఉండాలని చెప్పారు. “ఆల్లోపతి, ఆయుర్వేదం.. ఇలా ఎన్నో వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కొక్కటి ఒక్కోలా పని చేస్తుంది.. ఇప్పటికే రెండు కరోనా వేవ్స్ వచ్చాయ్, 3rd వేవ్ వస్తుందని చెబుతున్నారు, డెల్టా , డెల్టా ప్లస్ వచ్చాయ్ అంటున్నారు..

ఈ టైంలో లక్షలు ఖర్చు పెట్టే స్థితిలో ప్రజలు లేరు. కనుక అందుబాటులో ఉండే ఇలాంటి క్లినిక్స్ అవసరం. ఈ క్లినిక్ ట్రెండ్ సెట్ చేస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి క్లినిక్స్ ని ఏర్పాటు చేస్తే సమాజానికి ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఈ క్లినిక్ వల్ల మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను.” అని ప్రముఖులు తమ సందేశంలో పేర్కొన్నారు. అందరి ప్రోత్సాహం ఉంటే మరిన్ని క్లీనిక్స్ ఓపెన్ చేసి…సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని డా. అభినవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.

Read also : Perni Nani : ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదు : మంత్రి పేర్ని నాని