AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perni Nani : ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదు : మంత్రి పేర్ని నాని

కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే అని తేల్చి చెప్పారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఉద్వేగాలను.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు..

Perni Nani : ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదు : మంత్రి పేర్ని నాని
Perni Nani
Venkata Narayana
|

Updated on: Jun 25, 2021 | 3:41 PM

Share

AP Minister Perni Nani : కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే అని తేల్చి చెప్పారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఉద్వేగాలను.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా..? అని ప్రశ్నించిన పేర్ని.. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారని, ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో రాజకీయ అవసరాల కోసమే వైఎస్సారుని విమర్శిస్తారని మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సుప్రీం సూచనల మేరకు పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పిన మంత్రి.. ఈ నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబు విలయతాండవం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “పరీక్షల రద్దుతో చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే సత్తా చంద్రబాబుకి ఉందని అందరూ ఒప్పుకుంటాం…

చంద్రబాబు అబ్బాయి లేదా మా అబ్బాయిని చదివించేందుకు రామలింగ రాజు లాంటి డబ్బున్న వాళ్లు ముందుకొస్తారు. కానీ పేదల పిల్లలను చదివించేందుకు ఎవరు ముందుకొస్తారు..?” అంటూ మంత్రి.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. పిల్లలకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.

Read also : Prakash Raj : గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? : ప్రకాష్ రాజ్

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..