AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tasty Egg Recipes: ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్టీకి టెస్ట్.. 5 బెస్ట్ ఎగ్ రెసిపీస్ మీకోసం..

Tasty Egg Recipes: అసలే కరోనా కాలం.. హెల్తీ ఫుడ్ తప్ప మరేది తీసుకోవాలన్నా భయపడే పరిస్థితి వస్తోంది. ఫలితంగా ఎంతోమంది..

Tasty Egg Recipes: ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్టీకి టెస్ట్.. 5 బెస్ట్ ఎగ్ రెసిపీస్ మీకోసం..
Egg Snacks
Shiva Prajapati
|

Updated on: Jun 25, 2021 | 5:00 PM

Share

Tasty Egg Recipes: అసలే కరోనా కాలం.. హెల్తీ ఫుడ్ తప్ప మరేది తీసుకోవాలన్నా భయపడే పరిస్థితి వస్తోంది. ఫలితంగా ఎంతోమంది తమకు ఇష్టమైన, రుచికరమైన ఫుడ్ తినకుండా నోటికి తాళం వేసుకుంటున్నారు. మంచి ప్రోటీన్స్, ఇతర పోషకాలు ఉన్న ఆహార పదార్థాలనే తీసుకుంటున్నారు. సంపూర్ణ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలనే అనేక రకాల వెరైటీలు చేసి, రుచికరమైన వంటకాలు చేయొచ్చనే విషయాన్ని ఇక్కడ అందరూ మర్చిపోతున్నారు. ముఖ్యంగా ప్రోటీన్స్ ఫుష్కలంగా ఉన్న ఆహార పదార్థాల విషయానికి వస్తే గుడ్డును ప్రధానంగా చెప్పవచ్చు. ఈ గుడ్డు అనేక రకాలుగా వండి తినొచ్చు. ఉదయం ఉడకబెట్టిన గుడ్డును అల్పాహారంగా తీసుకోవచ్చు.. మధ్యాహ్నం భోజనంలో తినవచ్చు.. సాయంత్రం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. గుడ్డుతో చేసే ఐదు రకాల యమ్మీ, టేస్టే రెసిపిస్ ఎలా చేసేకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎగ్ ఐటమ్స్‌తో టేస్టీకి టేస్టీ, ప్రోటీన్స్‌కి శరీరానికి లభిస్తాయి.

ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎగ్ స్నాక్స్: 1.తండూరి ఎగ్: ఎగ్(గుడ్డు) టిక్కా అని కూడా పిలువబడే ఈ వంటకం సుగంధ ద్రవ్యాల స్వర్గధామం. ఉడికించిన గుడ్లను సగానికి కట్ చేసి వాటికి మసాలాలు, ఉల్లిగడ్డ ముక్కలు, కారం కలిపి వేయించాలి. తక్కువ సమయంలోనే రుచికరమైన ఎగ్ టిక్కా రెడీ. దీనిని చపాతీలతో కలిపి తింటే ఆ టేస్టీయే వేరు.

2. ఎగ్ కబాబ్: మధ్యధరా ప్రాంతానికి చెందిన ఆహారం ఇది. రుచికరమైన ఎగ్ కబాబ్‌ లను చేయడానికి ఉడకబెట్టిన గుడ్లను వేయించడం లేదా కాల్చడం చేస్తారు. దాంతోపాటు.. కోడిగుడ్డు చుట్టూ శనిగపిండి, మరికొన్ని మసాలా దినుసుల మిక్సింగ్‌ను అప్లై చేస్తారు. దీనిపై కొంచెం ఉల్లిపాలయలు, కొత్తిమీర వేసి అలంకరించి.. స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

3. ఎగ్ క్రీసెంట్స్: ఎగ్ క్రీసెంట్స్ అంటే శాండ్‌విచ్ మాదిరిగా ఉంటుంది. ఇది నోట్లో ఇట్టే కరిగిపోతుంది. గుడ్లతో తయారు చేసే బెస్ట్ స్నాక్స్‌లలో ఇది కూడా ఒకటి. ఈ శాండ్‌విడ్ తయారీలో పాలకూర వంటి ఆకు కూరలు వాడుతారు. తద్వారా ప్రోటీన్స్‌తో పాటు.. యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.

4. ఎగ్ చాట్: పేరుకు తగ్గట్లుగానే ఇది ఎంతో టేస్టీ రెసిపీ. ఇందులో గుడ్డ తన స్వభావాన్ని కోల్పోకుండా ఉంటుంది. దీని తయారీ కూడా చాలా సులభం. బాగా ఆకలి వేస్తే నిమిషాల్లో దీన్ని చేసుకుని తినేయొచ్చు. ఉడికించిన కోడిగుడ్డును ముక్కలుగా చేసి.. వాటికి తోడుగా ఇతర ఆకు కూరలు, క్యారెట్ బీట్‌రూట్ ముక్కలు వగైరా కలుపుకుని తినవచ్చు.

5. బేక్‌డ్ ఎగ్: ఎగ్ రెసిపీలలో ఇది చాలా ఈజీ వంటకం. దీనిని తయారు చేయడానికి ఉల్లిపాయ, ఎర్రటి టమోటాలు, ఆకుకూరలు ఉంటే చాలు. వీటిని ఒక బౌల్‌లో వేసి వేయించాలి. సరిపడా ఉప్పు, మిరియాల పొడి.. ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తరువాత.. గుడ్డును పగులగొట్టి వాటిపై వేయాలి. 170 నుంచి 180 డిగ్రీల మధ్య 5-6 నిమిషాలు ఓవెన్‌లో ఉంచాలి. అంతే.. టేస్టీ టేస్టీ బేక్‌డ్ రెసిపీ రెడీ.

Also read:

Traditions for Rains: పిల్లిపై నీటిని చిమ్మడం..స్త్రీలు నగ్నంగా పొలం దున్నడం..వర్షం కోసం వింత ఆచారాలు ఎక్కడంటే..