AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్ షాక్… గంట పాటు అకౌంట్​ యాక్సెస్ తొలిగింపు..

IT Minister Ravi Shankar: మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫార్మ్​ ట్విట్టర్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు ఓ గంట పాటు ముప్పు తిప్పలు పెట్టింది.

Twitter: కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్ షాక్... గంట పాటు అకౌంట్​ యాక్సెస్ తొలిగింపు..
Ravi Shankar Prasad
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 25, 2021 | 5:07 PM

Share

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు ట్విట్టర్ షాక్​ ఇచ్చింది. గంట పాటు మంత్రి ట్విట్టర్​ అకౌంట్​ను యాక్సెస్ చేసుకునే వీలు లేకుండా నిలిపివేసింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫార్మ్​ ట్విట్టర్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు ఓ గంట పాటు ముప్పు తిప్పలు పెట్టింది. ఐటీ చట్టాలను తయారు చేసిన మంత్రిగారి అకౌంట్‌ గంట సమయం పాటు యాక్సెస్ చేసుకునే వీలు లేకుండా​ చేసింది. USA డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్​ యాక్ట్ ఉల్లంఘించారన్న కారణంతో ఖాతాను నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో మంత్రిగా మండిపడ్డారు. ఇదే సంగతిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే…

టీవీ చ‌ర్చ‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను పోస్టు చేయ‌డం వ‌ల్ల‌.. ఆ పోస్టులు కాపీరైట్ చ‌ట్టాన్ని ఉల్లంఘించారంటూ ట్విట్టర్ ఆరోపించింది. ఈ  కారణంతో తన ట్విట్ట‌ర్ ఖాతా ప‌నిచేయ‌లేద‌ని మంత్రి తెలిపారు. అయితే మంత్రి అకౌంట్ మాత్రం నెట్ యూజ‌ర్ల‌కు క‌నిపించింది. కానీ మంత్రి అకౌంట్‌లోకి లాగిన్ కావ‌డానికి లేదా పోస్టు చేయ‌డానికి మాత్రం యాక్సెస్ దొర‌క‌లేదు. కాంటెంట్ పోస్టు చేస్తున్న స‌మ‌యంలో డిజిట‌ల్ మిలీనియ‌మ్ కాపీరైట్ యాక్ట్ నోటీసు వ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు.

అయితే.. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్​లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ చట్టం ప్రకారం ముందుగా నోటిసులివ్వకుండా అకౌంట్​ను ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్విట్టర్‌పై దేశ వ్యాప్తంగా నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి : బ్యాంక్ మునిగిపోయినప్పుడు మీ డబ్బుకు రక్షణ ఉంటుందా… ఆర్బీఐ ఏం చెబుతోందంటే…

Bonalu: బోనాలా జాతరకు భారీ ఏర్పాట్లు.. ఈ ఏడాది ఏనుగు ఊరేగింపు ఉంటుందన్న మంత్రి తలసాని

Follow Us
1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా