Bonalu: బోనాలా జాతరకు భారీ ఏర్పాట్లు.. ఈ ఏడాది ఏనుగు ఊరేగింపు ఉంటుందన్న మంత్రి తలసాని

బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ సర్కార్ భారీ ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్షిస్తున్నారు. తాజాగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో..

Bonalu: బోనాలా జాతరకు భారీ ఏర్పాట్లు.. ఈ ఏడాది ఏనుగు ఊరేగింపు ఉంటుందన్న మంత్రి తలసాని
Bonalu
Follow us

|

Updated on: Jun 25, 2021 | 4:18 PM

బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ సర్కార్ భారీ ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్షిస్తున్నారు. తాజాగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బోనాల నిర్వహణపై మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..  బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు.

ఈ ఏడాది బోనాల జాతరలో ఏనుగు ఊరేగింపు ఉంటుందని తలసాని తెలిపారు. ప్రభుత్వమే బోనాలకు నిధులను కేటాయించి నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది బోనాల పండుగ జరుపుకోలేదన్నారు. అమ్మవారి దయతో కరోనా సెకండ్ వేవ్ తగ్గిందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు.

ఎంత ఖర్చైనా వేనుకాడవద్దని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బోనాల ఉత్సవాలకు 15 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. గోల్కోండలో ప్రభుత్వం అన్ని లాంఛనాలతో పండుగ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. జులై 11 న గోల్కొండ, జులై 25 న సికింద్రాబాద్, ఆగస్టు 1 న లాల్ దర్వాజ బోనాలు ఉంటాయన్నారు.

బోనాలకు శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా డీజీపీ, మూడు కమిషనరేట్ల పరిధిలోని సీపీలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సాంస్కృతిక, విద్యుత్ శాఖలతోపాటు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంతో బోనాల వేడుకలు జరుగుతాయని వివరించారు. అన్ని దేవాలయాల వద్ద ప్రత్యేక లైటింగ్ ఏర్పాటూ చేయిస్తున్నట్లగా పేర్కొన్నారు. ప్రజలు ఆర్గనైజర్లు కోవిడ్ నిబంధనలు పాటించాలని… సానీటైజర్, మాస్కులు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి : బ్యాంక్ మునిగిపోయినప్పుడు మీ డబ్బుకు రక్షణ ఉంటుందా… ఆర్బీఐ ఏం చెబుతోందంటే…

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!