TPCC Meet Governor: గవర్నర్ తమిళసైని కలిసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. మయరిమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్టేషన్‌లో లాకప్ డెత్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని టీపీసీసీ నేతలు కలిశారు. బాధ్యలపై చర్యలు తీసుకోవాలని, మయరిమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
TPCC Leaders Meet Governor: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్టేషన్‌లో లాకప్ డెత్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని టీపీసీసీ నేతలు కలిశారు. బాధ్యలపై చర్యలు తీసుకోవాలని, మయరిమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు ఆపాలని కోరినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
మరియమ్మ లాకప్ డెత్ కేసులో నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడటంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొందరు పోలీస్‌శాఖకు మచ్చ తెచ్చేలా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి వారికి గుణపాఠం చెబుతామన్నారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు సీఎల్పీనే భట్టి విక్రమార్క. దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. లాకప్‌డెత్ తో చనిపోయిన మరియమ్మ కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కొంతమంది పోలీస్ అధికారులు అతి ఉత్సహంలో పని చేస్తున్నారు.. పోస్టింగ్‌ల కోసం, ప్రమోషన్లకోసం.. టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్, డీజీపీ వున్నారా లేరా అనేది కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పోలీసులు సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తే.. తీసుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో మాఫియాలపై కంప్లైంట్స్ ఇచ్చిన తీసుకునే పరిస్థితి లేదన్నారు.
Read Also…