AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: కేసీఆర్ అధికారానికి కారణమదే!.. చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

Revanth Reddy: పార్టీ నిర్ణయం మేరకే ముందుకు వెళతామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాడు మీడియాతో..

Revanth Reddy: కేసీఆర్ అధికారానికి కారణమదే!.. చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Shiva Prajapati
|

Updated on: Jun 27, 2021 | 6:17 PM

Share

Revanth Reddy: పార్టీ నిర్ణయం మేరకే ముందుకు వెళతామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవని, పార్టీ సమిష్టి నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా ఉమ్మడిగానే తీసుకుంటామని రేవంత్ రెడ్డి క్లియర్‌గా చెప్పారు. తెలంగాణలో ప్రజా పునరేకీకరణ జరగాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలను విడదీసి అధికారాన్ని పదిలం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్త కోసం తాము అండగా ఉంటామని నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా తాము అండగా నిలుస్తామన్నారు.

జులై 7వ తేదీన పీసీసీ చీఫ్‌గా ప్రమాణం.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన విషయం తెలిసిందే. రేవంత్ నియామకానికి సంబంధించి ఏఐసీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జులై 7వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైన‌ల్ చేసింది. వీరు త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారు. సీనియర్‌ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌‌లను కాంగ్రెస్ నియ‌మించింది. ఇక, ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టిపిసిసి) కొత్త అధ్యక్షులుగా నియ‌మితులైన రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు వెల్లువెత్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ కార్యాల‌యానికి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన నాయ‌కులు, కార్యక‌ర్తలు, అభిమానులు ఒక వైపైతే, రేవంత్‌రెడ్డిని క‌లిసి అభినంద‌న‌లు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజ‌య్య, మ‌ల్లుర‌వి, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ, అద్దంకి ద‌యాక‌ర్ , బెల్లయ్యనాయ‌క్‌, రేవంత్ రెడ్డిని క‌లిసి అభినంద‌న‌లు తెలియ‌జేసిన వారిలో ఉన్నారు. మేడ్చల్, నాగ‌ర్‌క‌ర్నూలు, రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద ప‌ల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూత‌న టిపిసిసి అధ్యక్షులు, మంద‌కృష్ణమాదిగ.. రేవంత్ రెడ్డికి ఫోన్‌లో అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Also read:

Jr. NTR: చిత్రం సీక్వెల్‌లో న‌టించేది నితిన్ కాదంటా.. మ‌రెవ‌రంటే.. తెర‌పైకి మ‌రో కొత్త పేరు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌..