Hyderabad: నేటి మేటి రాజకీయ నాయకుడు.. తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు.. ఈ ఫోటోలో ఉన్నారు గుర్తుపట్టగలరా?
Hyderabad: నేటి మేటి రాజకీయ నాయకుడు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో సుపరిచితులు.. ఈ ఫోటోలో ఉన్నారు. మీరేమైనా..
Hyderabad: నేటి మేటి రాజకీయ నాయకుడు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో సుపరిచితులు.. ఈ ఫోటోలో ఉన్నారు. మీరేమైనా గుర్తు పట్టగలరా? అయితే ట్రై చేయండి. ఇంకా గుర్తు రావడం లేదా? అయితే చిన్న క్లూ.. ఈ ఫోటోలో పై వరుసలో రెండవ స్థానంలో ఉన్నారు. ఏంటీ ఇంకా గుర్తు రావడం లేదా? సరేలేండి.. ఇక మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్. అవునండీ.. స్వయంగా మంత్రి కేటీఆరే ఈ త్రో బ్యాక్ పిక్‌ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.
KTR Tweet:
#Throwback pic from 1984!
Bharath, a classmate of mine from 4th grade sent this pic yesterday ?
It was St. Joseph’s public school in Karimnagar. Strange but true, I was able to recollect the names of almost all in the pic pic.twitter.com/QcPqT2D5Mb
— KTR (@KTRTRS) June 27, 2021
మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, రాష్ట్రాభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు ప్రతీ అంశాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసే మంత్రి కేటీఆర్.. తాజాగా తన వ్యక్తిగత ఫోటోను షేర్ చేశారు. 1984లో తాను 4వ తరగతి చదువుతున్న నాటి ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేశాడు. భరత్ అనే తన క్లాస్‌మేట్ ఈ ఫోటోను తనకు షేర్ చేశాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కరీంనగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో నాలుగో తరగతి చదివే సమయంలో సహచర విద్యార్థులు, టీచర్లతో దిగిన ఫోటో అని, సర్‌ప్రైజ్‌గా ఉందని అన్నారు. దాదాపు ఇందులోని అందరి పేర్లను గుర్తుతెచ్చుకోగలిగానని పేర్కొన్నారు. మొత్తానికి మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫోటోపై టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. కేటీఆర్ త్రో బ్యాక్ పిక్‌ని రీట్వీట్ చేస్తున్నారు.
Also read:
AP Weather Report : ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. రాగల మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..