Cyber Crime Alert: ఎస్‌బీఐ కేవైసీ అప్‌డేట్ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే..
Cyber Crime Alert: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల తీరు కూడా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏదో మూలన ఉండి మన అకౌంట్‌లోని డబ్బులను కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా...
Cyber Crime Alert: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల తీరు కూడా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏదో మూలన ఉండి మన అకౌంట్‌లోని డబ్బులను కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా కొంప కొల్లేరు అవ్వాల్సిందే. ఇక ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కూడా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బ్యాంకుల కేవైసీ పేరుతో నకిలీ లింక్‌లను మొబైల్ ఫోన్లకు పంపుతూ యూజర్లను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఓ లింక్ తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్. కేవైసీ అప్‌డేట్ చేసుకోకుంటే మీ ఎస్‌బీఐ ఖాతాను తొలగిస్తామంటూ ఓ నకిలీ మెసేజ్ వస్తుంది. పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇదే విషయాన్ని చెబుతూ.. సైబర్ క్రైమ్ వింగ్ ట్వీట్ చేసింది. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో కేవైసీ అప్‌డేట్ చేసుకోమని లింక్‌లు పంపించవని, మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకండని ఖాతాదారులను అలర్ట్ చేసింది.
పోలీసులు చేసిన ట్వీట్..
#SBI బ్యాంకు #KYC అప్‌డేట్ అంటూ వచ్చే ఫేక్ లింక్ ల పట్ల ..జాగ్రత్తగా …ఉండండి @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @RachakondaCop pic.twitter.com/DFkS4bThBz
— Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) June 27, 2021
Also Read: Telugu : తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి.. ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Telugu : తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి.. ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Maoist party: అడవిలో ఆందోళన.. హరిభూషణ్ స్థానంలో ఎవరొస్తారు.. ఇంటెలిజెన్స్ వర్గాల స్పెషల్ ఫోకస్..