యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు పోటీ చేస్తాం….ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… పొత్తు ఎవరితోనంటే …?
యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము 100 సీట్లకు పోటీ చేస్తామని ఎంఐఎం (ఆలిండియా మజ్లీస్ పార్టీ)అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము 100 సీట్లకు పోటీ చేస్తామని ఎంఐఎం (ఆలిండియా మజ్లీస్ పార్టీ)అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అప్పుడే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఆయన తెలిపారు. యూపీ ఎన్నికల్లో ఓం ప్రకాష్ రాజ్ భర్ నేతృత్వంలోని భగీదారి సంకల్ప్ మోర్చా (బీఎస్ఎం) తో పొత్తు కుదుర్చుకుంటామని, మరెవరితోనూ లేదని ఆయన ట్వీట్ చేశారు. ఎన్డీయేకి లోగడ మిత్ర పక్షంగా ఉన్న బీఎస్ఎం…సీఎం యోగి ఆదిత్యనాథ్ తో వచ్చిన విభేదాల కారణంగా బీజేపీ కూటమి నుంచి వైదొలగింది. యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే అసదుద్దీన్ ఒవైసీ ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా- రాష్ట్రంలో ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ఉన్న పశ్చిమ, తూర్పు ప్రాంతంలోనూ, సెంట్రల్ లోను తమ అభ్యర్థులను నిలబెడతామని యూపీ ఎంఐఎం చీఫ్ షౌకత్ అలీ నిన్న ప్రకటించారు. అభ్యర్థులు ఎవరు మంచివారయినా వారికి ప్రాధాన్యమిస్తామన్నారు.
యూపీ ఎన్నికల్లో ఎంఐఎం మొదటిసారిగా పోటీ చేయనుంది. ఈ రాష్ట్ర ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. 403 మంది ఎమ్మెల్యేలను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి వచ్చే సంవత్సరం మార్చి 14 తో ముగియనుంది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన విపక్షాల లక్ష్యమల్లా ఇక్కడ బీజేపీని ఎదుర్కొవాలన్నదే.. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ వంటివి ఒంటరిగా పోటీ చేయనున్నాయి. ఈ క్రమంలో ఎంఐఎం బీఎస్ఎం తో పొత్తు కుదుర్చుకోవడం గమనార్హం.
उ.प्र. चुनाव को लेकर मैं कुछ बातें आपके सामने रख देना चाहता हूँ:-
1) हमने फैसला लिया है कि हम 100 सीटों पर अपना उम्मीदवार खड़ा करेंगे, पार्टी ने उम्मीदवारों को चुनने का प्रक्रिया शुरू कर दी है और हमने उम्मीदवार आवेदन पत्र भी जारी कर दिया है।1/2
— Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: CM KCR: దళితుల అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి నర్సింహులు..