అచ్చెన్నాయుడుకి షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి మరో షాక్ తగిలింది. బెయిల్ కోసం అచ్చెన్నాయుడు సహా నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కోర్టు కొట్టివేసింది.

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి మరో షాక్ తగిలింది. బెయిల్ కోసం అచ్చెన్నాయుడు సహా నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎం. వెంకటరమణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుని గత నెల 16న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ కేసులో మొదటి నిందితుడు సి.కె.రమేష్‌కుమార్, జి.విజయ్‌కుమార్, వి.జనార్దన్, ఇవన రమేష్‌బాబు, గోన వెంకట సుబ్బారావు, మరో ఇద్దరు నిందితులు వేర్వేరుగా బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే మరోవైపు రెండు శస్త్ర చికిత్సలు చేయించుకున్న తనకు ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించేలా ఆదేశాలివ్వాలంటూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగియగా.. ఇవాళ తీర్పు వెలువడనుంది.



