- Telugu News పొలిటికల్ ఫొటోలు Narayanpet minister ktr inaugiration of handloom textile park training center and children icu ward
నేతన్నల సంక్షేమమే సర్కార్ ధ్యేయమన్న మంత్రి కేటీఆర్.. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం.. చిత్రాలు..
నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కు, ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల ఐసీయూ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Updated on: Jul 10, 2021 | 2:12 PM

KTR

రూ.10కోట్లతో నిర్మించ తలపెట్టిన నారాయణపేట చేనేత కళాకారులందరికీ నైపుణ్య శిక్షణ కేంద్రానికి మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు.

నేతన్న చేయూత కార్యక్రమం ద్వారా గతేడాది రూ. 96 కోట్లు విడుదల చేశామన్నారు. కరోనా సమయంలో ఈ నిధుల వల్ల కార్మికులకు లాభం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.

నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఐసీయూ వార్డును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

చిల్డ్రన్స్ ఐసీయూ వార్డులో ఏర్పాటు చేసిన వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్.

నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఐసీయూ వార్డులో మంత్రి కేటీఆర్.