Telugu News » Photo gallery » World photos » These is the perseverance rover collect first rock samples to be returned to earth from mars here full details
అంగారకుడి పై రాళ్లను సేకరించే పనిలో శాస్త్రవేత్తలు.. మట్టి కోసం రెడ్ ప్లానెట్ పై పవర్ఫుల్ రోవర్..
గత కొద్ది కాలంగా అంగారకుడిపై మానవ మనుగడ సాధ్యమవుతుందా అనే విషయంపై శాస్త్రవేత్తలు కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇటీవల రెడ్ ప్లానెట్ పై నీటి జాడలు కనుగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంగారకుడిపై ఉన్న మట్టిని భూమి పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల శాస్త్రవేత్తలు పంపిన రోవర్ అంగారకుడిపై తవ్వి మట్టిని సేకరిస్తుంది. ఆ తర్వాత ఆ మట్టి నమూనాలకు భూమికి పంపిస్తుంది. అయితే గతంలో మట్టి నమునాలను సేకరించే ప్రయత్నం విఫలమైంది.
1 / 7
ఆ రోవర్ పేరు రోచెట్.. ఇది SUV సైజు రోవర్ ఒక రాతి ఉపరితలాన్ని గుర్తిస్తుంది. దీని ద్వారా శాస్త్రవేత్తలు లోపలికి వెళ్లి వారు నమూనా చేయాలనుకుంటున్నారా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ రోవర్ జెజెరో క్రేటర్ దగ్గర కదులుతోంది. రోవర్ అంగారకుడిపై ఉన్న పురాతన కాలం మట్టిని సేకరిస్తుంది.
2 / 7
రోవర్ ఉపరితలంపై స్క్రాప్ చేయడానికి 7 అడుగుల పొడవు రోబోటిక్ ఆర్మ్‌ని ఉపయోగిస్తుంది. మట్టిని సేకరించే ప్రక్రియ వచ్చే వారం ప్రారంభమవుతుంది. భూగర్భ రాడార్ ద్వారా రాళ్ల దిగువ పొరలను ఈ రోవర్ గుర్తిస్తుంది.
3 / 7
రోవర్ అక్కడున్న మట్టి కోసం 'సిటాడెల్' ఫ్రెంచ్ అనే రిడ్జ్‌లో నమూనాలను వెతుకుతుంది. ఈ ప్రాంతం రోవర్ చివరిసారిగా నమూనాను సేకరించడానికి ప్రయత్నించిన ప్రదేశానికి 455 మీటర్ల దూరంలో ఉంది.
4 / 7
రోవర్‌తోపాటు మినీ-హెలికాప్టర్ ఇమేజింగ్ ద్వారా అక్కడ ఉన్న అవక్షేపణ శిల శాంపిల్ చేయడానికి చాలా మెరుగ్గా ఉంటుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. నాసా ప్రకారం గ్రహంపై పూర్తిగా రాళ్లు ఉన్నాయి. అలాగే ఎక్కువగా కోతకు గురై ఉంది. డ్రిల్లింగ్ చేయడం ద్వారా అంగారకుడి పై మట్టిని సేకరించవచ్చు.
5 / 7
రాళ్ల ఆకృతిని గమనించడానికి మరియు ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి శక్తివంతమైన లేజర్‌ని ఉపయోగించడమే కాకుండా.. రోవర్ పైన ఒక సూపర్ కెమెరా అమర్చారు. నాసా ఇంజనీర్లు ఒక నిర్దిష్ట స్థలాన్ని కనుగొంటే దానిని నిశితంగా పరిశీలించమని ఇక్కడి నుంచే వారు రోవర్‌కి సూచించవచ్చు.
6 / 7
SHERLOC అనే పరికరం రోవర్ ఆర్మ్‌పై అమర్చబడి ఉంటుంది. ఇది కెమెరాలు, లేజర్‌లు మరియు ఇతర పరికరాలను రాళ్లపై నిఘా ఉంచడానికి పనిచేస్తుంది. అలాగే దీని ద్వారా ఇది గ్రహంపై ఉండే రాళ్లలోని ఖనిజాలు, సేంద్రీయ అణువులు మరియు సాధ్యమయ్యే జీవసంబంధాలను గుర్తిస్తుంది.