సెగలు రేపుతున్న శ్రీముఖి బ్లాక్ డ్రెస్ ఫోటోస్ 

Phani CH

23 December 2024

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.

నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి  రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.  తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి.

రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. 

టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది.

క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.