- Telugu News Photo Gallery World photos Know these are the popular dishes of different countries including india america
ఏ వంటకాలు ఏఏ దేశాల్లో ప్రత్యేకమో తెలుసా.. భారత్ నుంచి అమెరికా వరకు ఇవే స్పెషల్స్..
ప్రతి దేశంలో విభిన్న రకాల ఆహారా పదార్థాలు ప్రత్యేకంగా ఉంటాయి. మన భారతదేశంలో అనేక రకాల వంటకాలు స్పెషల్.. ఆవకాయ అన్నం నుంచి బిర్యానీ వరకు ఇలా ప్రతిదీ స్పెషల్. మరి ఇతర దేశాల్లో ఏ వంటకాలు స్పెషల్ తెలుసుకుందామా.
Updated on: Nov 20, 2021 | 8:14 PM

ఆస్ట్రేలియా సంప్రదాయ వంటకం.. మీట్ పై. దీనిని మాంసం, పిండి, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇది కేక్ మాదిరిగా ఉంటుంది.

అమెరికాలో హామ్ బర్గర్ ఫేమస్. అమెరికా వెళ్లిన ప్రతి ఒక్కరు ఈ హామ్ బర్గర్ తినాల్సిందే. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లభిస్తుంది. దీనిని బన్స్ ముక్కలు చేసి బ్రెడ్ రోల్స్, సాసేజ్, బీఫ్ ప్యాటీలతో రెడీ చేస్తారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో బిర్యానీ పులావ్ స్పెషల్. ఈ క్యాస్రోల్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయ వంటకం. దీనిని బస్మతి బియ్యం, గొర్రె మాంసం, క్యారెట్లు, ఎండు ద్రాక్ష, అనేక రకాల మసాల దినుసులతో రెడీ చేస్తారు

ఫ్రాన్స్‌లో Pot-au-Feu స్పెషల్. ఇది ఫ్రాన్స్ జాతీయ వంటకం. మాంసం, కూరగాయలతో తయారు చేస్తారు. దీనిని క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్ అంటారు.

కాల్చిన గొడ్డు మాంసం.. యార్క్ షైర్ ఫుడ్డింగ్ ఇంగ్లాండ్ సాంప్రదాయ వంటకం. ఇది మెరినేట్ చేసిన గొడ్డు మాంసం నుంచి తయారు చేస్తారు. దీనిని కాల్చిన బంగాళదుంతో వడ్డిస్తారు.





























