మీడియా నివేదికల ప్రకారం జూన్ 23, 1852న ఒక ఫ్రెంచ్ కళాకారుడు లూక్ మాస్పెరో మోనాలిసా చిరునవ్వు, అందం మీద వ్యామోహంతో పారిస్ హోటల్ పైకప్పుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పెయింటింగ్‌ను చాలాసార్లు పాడు చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పెయింటింగ్ దాని అసలు స్థలం నుండి 6 సార్లు మార్చారు. కొన్నిసార్లు దానిపై రాళ్లు, యాసిడ్ వేశారు. ఇలాంటి ఘటనల దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ ఫ్రేమ్‌లో ఉంచారు.