- Telugu News Photo Gallery World photos Know the worlds largest printer which prints 50 meters long cloth at a time
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రింటర్.. 50 మీటర్ల వస్త్రాన్ని ఒకేసారి ప్రింట్ చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా..
ప్రింటర్స్ లేనప్పుడు అసలు ప్రపంచం ఎలా ఉండేదో తెలుసా.. కేవలం చేతి రాతతోనే ప్రతి పేపర్ ఉండేది. వార్త పత్రికలు సైతం చేతితోనే రాసేవారు. ఇక చిత్రాలను సైతం చేతితోనే వేసేవారు.
Updated on: Dec 10, 2021 | 12:48 PM

ప్రింటర్స్ లేని సమయంలో చేతిరాతతోనే వార్తపత్రికలు.. చిత్రాలను చిత్రీకరించేవారు. మొట్టమొదటిసారి ప్రింటర్ తీసుకువచ్చిన తర్వాత అనేక పనులు సులభమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రింటర్ ఎక్కడుందో తెలుసుకుందామా.

1938లో చెస్టర్ కార్ల్సన్ ప్రింటర్‌ను కనుగొన్నారు. ఇది ప్రాథమిక ప్రింటర్. క్రమంగా దీనిని అధునాతన రూపాలు రావడం జరిగింది. 1969లో గ్యారీ స్టార్క్ వెదర్ లేజర్ ప్రింటర్‌ను కనిపెట్టారు. ఇది 1971 నాటికి అభివృద్ధి చెందింది. జర్మనీలో అతి పెద్ద ప్రింటర్ ఉంది.

డ్యుయిష్ వెల్లే నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద కలర్ ప్రింటర్ జర్మనీ రాజధాని బెర్లిన్ సమీపంలోని బిగ్ ఇమేజ్ సిస్టమ్స్ కంపెనీకి చెందినది. ఈ ప్రింటర్ పెద్ద బ్యానర్లు, పోస్టర్స్, బ్యాక్ డ్రాప్‌లను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రింటర్ 50 మీటర్ల పొడవు ఉన్న దుస్తులను ఒకేసారి ప్రింట్ చేస్తుంది. ఈ ప్రింటర్ అతి పెద్ద బ్యానర్స్, పోస్టర్స్ మొదలైనవి సిద్ధం చేస్తుంది.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రింటర్ 50 మీటర్ల పొడవు ఉన్న దుస్తులను ఒకేసారి ప్రింట్ చేస్తుంది. ఈ ప్రింటర్ అతి పెద్ద బ్యానర్స్, పోస్టర్స్ మొదలైనవి సిద్ధం చేస్తుంది.





























