- Telugu News Photo Gallery World photos Know interesting facts about world oldest and ancient cities in the world
ప్రపంచంలోనే అత్యంత పురాతమైన నగరాలు.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా.. ఎక్కడున్నాయో తెలుసా..
ఈ ప్రపంచంలో ఎన్నో కనుమరుగైనా ప్రదేశాలు. కట్టడాలు ఉన్నాయి. అలాగే పూరాతన కాలంలో చాలా మంది ప్రజలు నివసించి కనుమరుగైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడు బయటపడుతుండగా.. మరికొన్ని ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అవి ఏంటో.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా.
Updated on: Aug 05, 2021 | 1:04 PM

పాలస్తీనాలోని జెరిఖో నగరం ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రజలు ఈ నగరంలో 11 వేల సంవత్సరాల క్రితం నివసించారు. ఈ నగరం జోర్డాన్ నది ఒడ్డున ఉంది.

లెబనాన్ ప్రాంతంలోని బైబ్లోస్ కూడా ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. ఈ నగరం 7000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఈ నగరం లెబనాన్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. 12వ శతాబ్దంలో నిర్మించిన అనేక పురాతన దేవాలయాలు, కోటలు ఉన్నాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూడటానికి వస్తారు.

మన దేశంలో ఉన్న వారణాసిని.. కాశి అని.. బనారస్ అని అంటారు. ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం ఈ నగరం మిలియన్ల సంవత్సరాల పురాతనమైనది. కానీ చాలా మంది చరిత్రకారులు దీనిని ఐదు వేల సంవత్సరాల పురాతన నగరమని అంటారు. ఈ నగరం భారతదేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఇక్కడకు వస్తారు.

సిరియాలోని అలెప్పో నగరం కూడా ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. ఈ నగరం దాదాపు 6300 సంవత్సరాల నాటిదని చెబుతారు. పురాతన కాలం నుండి ఈ నగరం ఆసియా, ఐరోపా మధ్య ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది.

సిరియాలోని డమాస్కస్ నగరం కూడా ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. చరిత్రకారుల ప్రకారం ఈ నగరం 6300 సంవత్సరాల క్రితం కూడా ఉంది. పర్యాటకులను ఆకర్షించే అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత పురాతమైన నగరాలు..




