Kitchen Hacks: వంట పాత్రల జిడ్డు వదిలించడానికి వేడి నీటిని ఉపయోగిస్తున్నారా? కాస్త ఆలోచించడం బెటర్..
వంటకు పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా నూనెతో కూడిన జిడ్డు పాత్రలను శుభ్రం చేయడం, వంట పాత్రలపై అంటుకున్న నూనెను వదిలించడానికి చాలామంది వేడి నీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 31, 2025 | 1:34 PM

వంటకు వినియోగించే పాత్రలను శుభ్రం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే లేనిపోని చిక్కులకు ఇవే కారణం అవుతాయి. ముఖ్యంగా నూనెతో కూడిన జిడ్డు పాత్రలను శుభ్రం చేయడం గృహిణులకు అతిపెద్ద సవాల్. ఇవి ఓ పట్టాన శుభ్రం కావు. దీంతో వంట పాత్రలపై అంటుకున్న నూనెను వదిలించడానికి చాలామంది వేడి నీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాత్రలపై జిడ్డును వేడి నీటితో తేలికగా శుభ్రం చేయవచ్చు. కానీ ఆ తర్వాత సంభవించే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అసలెందుకు వేడి నీటితో పాత్రలను శుభ్రం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

జిడ్డైన పాత్రలను శుభ్రం చేయడానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల.. అందులో ఉపయోగించే ఆహారంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే వేడి నీటితో జిడ్డు పాత్రలను కడిగినప్పుడు.. వాటిపై మురికి నీరు బలంగా అంటుకుపోతుంది. పాత్రలపై వేడి నీరు చల్లారిన తర్వాత, ఈ విధమైన మరకలు పాత్రలపై కనిపిస్తాయి.

మీరు వేడి నీటిలో నాన్ స్టిక్ లేదా ఐరన్ పాత్రలను శుభ్రం చేస్తే.. దానిలోని ఉపరితల పూత మరింత ప్రభావితం అవుతుంది. వేడి నీరు పాత్రల్లో పగుళ్లకు కారణమవుతుంది. ముఖ్యంగా నాన్-స్టిక్ ప్యాన్‌లను వేడి నీటితో కడిగితే అవి త్వరగా పాడైపోతాయి.

బదులుగా సబ్బుతో సున్నితంగా వీటిని శుభ్రం చేయాలి. ప్యాన్‌లను శుభ్రం చేసేటప్పుడు, తేలికపాటి డిష్‌వాషింగ్ సబ్బు లేదా ద్రవాన్ని ఉపయోగించాలి. ఇది పాత్రలకు హాని కలిగించకుండా మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.

స్టీల్, ఉన్ని వంటివి కాకుండా మృదువైన సిలికాన్ స్క్రబ్బర్‌లను పాత్రలను శుభ్రం చేయడానికి ఎంచుకోవాలి. కఠినమైన స్క్రబ్బర్‌లు పాత్రలఉపరితలంపై గీతలు పడేలా చేస్తాయి. కంటైనర్ పైన ఉన్న రక్షిత పొరలను దెబ్బతీస్తాయి.





























